ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

కడప: జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు ఉన్న అనుకూల, అననుకూల పరిస్థితులపరిశీలకై జిల్లాకు వచ్చిన 8 మంది సెయిల్‌(Steel Athority of India-SAIL) బృందం ఆదివారం సికె దిన్నెమండలంలోని కొప్పర్తి, జమ్మలమడుగు మండలంలోని బ్రహ్మణీ ప్లాంట్‌ స్థలం, మైలవరం మండలంలోని ఎం. కంబాల దిన్నె, ప్రాంతాన్ని పరిశీలించారు. మైలవరంరిజర్వయర్‌ను కూడా బృందం సభ్యులు పరిశీలించారు.

రిజర్వయర్‌ లో నీటిసామర్థ్యం గత పది సంవత్సరాల కాలంలో సరాసరి నిల ్వవున్న నీటి వసతి వివరాలనుఅధికారుల ను అడిగి తెలుసుకున్నారు. రిజర్వయర్‌ లో నీటి నిలువ సామర్ధ్యం 10 టీఎంసీలు అని అధికారులు బృందానికి తెలిపారు. అలాగే గండికోట రిజర్వయర్‌ నందుకూడా 26.08 టీఎంపసీల నిల్వ సామర్థ్యం ఉందన్నారు. ఏర్పాటు చేయబోయే ఉక్కుకర్మాగారానికి 1.8 టీఎంసీల నీరు సరిపోతుందని బృందం సభ్యులు తెలిపారు.

చదవండి :  రాయలసీమకు తరతరాలుగా అన్యాయం: బి.వి.రాఘవులు

ఉక్కుపరిశ్రమ స్థాపనకు 3000 ఎకరాల భూమి అవసర ముంటుందని, ఇందుకు రూ. 20 వేలకోట్ల రూపాయాలు అంచనా వ్యయ0 అవసరమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఅనుమతించిన 48 మాసాల్లో కర్మాగార నిర్మాణం రూపు దిద్దుకుంటుందన్నారు.సంవత్సరానికి 3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కల్గిఉంటుందన్నారు. నిర్మాణం పూర్తియితే 10 వేల మందికి ప్రత్యక్షంగా మరో 20 వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. అలాగే అనుబంధ పరిశ్రమలుకూడా ఏర్పడి మరింత ఉపాధి అవకాశాలు విస్తృతమవుతుందన్నారు.

చదవండి :  మాసీమ రాజగోపాల్‌రెడ్డి ఇక లేరు !

బృందంసభ్యులు మాట్లాడుతూ ఈ ప్రదేశాల సమీపంలో కరెంట్‌ , నీరు లభ్యత, రైల్వే, రోడ్డు వసతి, జిల్లా చూట్టు ప్రక్కల ఉన్న ఖనిజ లభ్యత గురించిన వివరాలుజిల్లా యంత్రాంగం ద్వారా సేకరించడం జరిగిందన్నారు. మూడు ప్రాంతాల్లో ఎక ్కడఉక్కు కర్మాగారం నిర్మిస్తే అనుకూలంగా ఉంటుందోనన్న అంశంపై క్షుణంగాప్రాజెక్టు రిపోర్టును కేంద్ర కార్యాలయానికి పరిశీలన కోరకుపంపుతామన్నారు.

ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌. అవినాష్‌రెడ్డి, కడప శాసనసభ్యులు అంజాద్‌ బాష, జమ్మలమడుగు శాసనసభ్యులుఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓరఘునాధరెడ్డి, ఏపీ ఐఐసి జోనల్‌ మేనేజర్‌ రమణారెడ్డి, ట్రాన్స్‌కో ఈఈఎస్‌కె. బాషా, గ్రౌండ్‌ వాటర్‌ ఏడీ మురళీ, ఆర్‌ అండ్‌ బీ ఈఈ చంద్రశేఖర్‌, జిఎన్‌ఎస్‌ఎస్‌ ఈఈ ప్రసన్నరావు, డిప్యూటీ ఎస్‌ఐ జిలన్‌, ఎస్‌ఎస్‌రవిరెడ్డి, తదితర అధికారులు అనాధికారులు పాల్గొన్నారు.

చదవండి :  కమనీయం... కోనేటిరాయుని కళ్యాణం

ఇదీ చదవండి!

మండలాలు

కడప జిల్లా మండలాలు

కడప జిల్లా లేదా వైఎస్ఆర్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం 51 మండలాలు గా విభజించారు. అవి : 1 …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: