
ఈ రోజు నుంచి బడికి ఎండలకాలం సెలవలు
పాఠశాలలకు ఈ రోజు (24వ తేదీ) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నారుు. కాగా, పాఠశాలలు కొత్త రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పునఃప్రారంభం కానున్నారుు. ఇదిలాఉండగా, 7నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు విద్యాశాఖ వుుందుగానే పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టింది. జిల్లాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి కావచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులు వేసవి సెలవుల్లో చదువుకునేలా ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.
7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లో ఇప్పటివరకు 70 శాతం వరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.
హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు వుుందుగానే పుస్తకాలు పంపిణీ చేయుడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.