ఇంకనేల వెరపు
పులివెందుల రంగనాథ స్వామి దేవళం

ఇంకనేల వెరపు – పులివెందుల రంగనాథుని అన్నమయ్య సంకీర్తన

పులివెందుల రంగనాథుని పైన అన్నమయ్య రాసిన సంకీర్తన

పులివెందులలోని రంగనాయక స్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. రైల్వే కొండాపురం వద్ద గల ముచ్చుమర్రి అనే గ్రామంలోని పెద్ద రంగడు, చిన్న రంగడు అనే రజక సోదరుల స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఏటిలో ఉన్న నన్ను పులివెందులలో ప్రతిష్ఠించవలసిందిగా అజ్ఞాపించారట.

రాగము: మలహరి
రేకు: 0603-4
సంపుటము: 14-15

॥పల్లవి॥

ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము
వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు

చదవండి :  ఇందులోనే కానవద్దా - అన్నమయ్య సంకీర్తన

॥చ1॥

వావులు నీకెంచనేల వాడల గొల్లెతలకు
దేవరవు గావా తెలిసినదే
యీవల మావంక నిట్టె యేమి చూచేవు తప్పక
మోవనాడితి మిధివో మొదలనే నేము

॥చ2॥

చందాలు చెప్పఁగనేల సతినెత్తుక వచ్చితి
విందుకు రాజవు గావా యెరిఁగినదే
దిందుపడి మమ్ము నేల తిట్టేవు పెదవులను
నిందవేసితి మిదివో నిన్ననే నేము

॥చ3॥

వెలినవ్వేల పదారువేలఁ బెండ్లాడితివి
బలిమికాఁడవు గావా భావించినదే
చెలఁగి పులివిందల శ్రీరంగదేవుఁడ వని
కలసితి మిదె శ్రీ వేంకటరాయ నేము

చదవండి :  పులివెందుల శాసనసభ, కడప లోక్ సభ స్థానాలు ఖాళీ

ఇదీ చదవండి!

ఈనాడు పైత్యం

పులివెందుల పేర మళ్ళా ఈనాడు పైత్యం

తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు చదివే పత్రికగా చెలామణి అవుతున్న ఈనాడు ఒక వార్తకు పెట్టిన హెడింగ్ ద్వారా మళ్ళా తన …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: