రాష్ట్రంలో ప్రభుత్వ బోధనా కళాశాలల్లో అన్నింటిలో కలిపి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటు ఒకే ఒక్కటి ఉంటుంది.
2013-14 విద్యాసంవత్సరానికి జరిగిన స్విమ్స్ సెట్‌లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఉన్న ఏకైక సీటును జిల్లా వాసి సొంతం చేసుకున్నాడు.
శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్‌స్పెషాలిటీ కోర్సులో డా.దినకర్‌రెడ్డి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటు సాధించారు.
వైఎస్సార్ (కడప) జిల్లా పులివెందులకు చెందిన డా.దినకర్‌రెడ్డి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, పీజీ(జనరల్ సర్జరీ) చేశారు.