
రేపూ…మన్నాడు ఆస్థానే మురాదియాలో ఉరుసు ఉత్సవాలు
కడప: స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ దగ్గర గల హజరత్ ఖ్వాజా సయ్యద్‌షామొహర్ అలీ (మొరి సయ్యద్‌సాహెబ్ వలి) 417వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 20, 21వ తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఆస్థానే మురాదియా దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా ఆధ్వర్యంలో 20వ తేదీ శనివారం గంథం ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ముగరిబ్ నమాజ్ తరువాత పీఠాధిపతి ఇంటి నుంచి ఫకీర్ల మేళతాళాలతో దర్గా చేరుకొని గంథాన్ని సమర్పించనున్నారు. 21వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఖవ్వాలి కార్యక్రమం వుంటుంది.