శనివారం , 7 డిసెంబర్ 2024
'కరువు' విషయంలో

అశోకుడికి ‘కరువు’ విషయంలో సానుభూతి లేదేం?

అశోకుడిగా ఎన్జీవోలు సరదాగా పిలుచుకునే ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ‘అశోక్ బాబు’ ఉదార స్వభావం కలిగిన వాడు. ప్రకృతి వైపరీత్యాల బారినపడ్డ ప్రజల బాధలను చూసినా, విన్నా చలించిపోయే సుతి మెత్తని మనస్సు కలిగిన వాడు. కాబట్టే అతివృష్టి కారణంగా దెబ్బతిన్న విశాఖను ఆదుకోవటానికి ఉద్యోగుల జీతం నుంచి ఉదారంగా విరాళం ప్రకటించేశాడు.

ఆనక కొత్త రాజధాని కట్టడానికి డబ్బులు లేవు విరాళాలు ఇవ్వండి బాబూ అని డబ్బాలు ఏర్పాటు చేసి కొత్తగా కొలువుదీరిన ఆం.ప్ర ప్రభుత్వం రోదిస్తుంటే తల్లడిల్లిపోయాడు. ఇంకేముంది వెంటనే ఉద్యోగుల జీతం నుంచి రాజధాని ఇటుకలు కొనేదానికి ఏకపక్షంగా ధారాళంగా  విరాళం  ప్రకటించేశాడు.

చదవండి :  బెంగుళూరులో రాయలసీమ చైతన్య సదస్సు

ఆనక రెండు వేర్వేరు ఘటనలలో ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ నాయకులు/ పాలక పక్షానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. సున్నితమైన మనస్సు కలిగిన అశోకుడు ఈ ఘటనకు నొచ్చుకుని కొద్ది రోజులు మీడియాకు ముఖం చేశాడు. ఆనక ఒకరోజు మీడియా వారి కంటబడితే దాడులపై ఏవిటండీ మీ స్పందన అని అడిగితే… ఇలాటివి షరా మామూలే అని సానుభూతి వ్యక్తం చేసినారు, సున్నితత్వం దెబ్బ తినకుండా.

ఇప్పుడు అశోకుడి సున్నిత మనస్సును కలవరపెట్టే మరో ప్రకృతి వైపరీత్యం కళ్ళముందు కన్పిస్తోంది – కరువు బాధలు భరించలేక, ఉపాధి కల్పించలేని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక రాయలసీమ ప్రజలు వలస బాట పట్టినారు. సీమ జిల్లాలలో పలుచోట్ల తాగే నీళ్ళకు కూడా ప్రజలు అగచాట్లు పడుతున్నారు. ఈ విషయాలు దగ్గరగా చూస్తున్న సీమ ఎన్జీవోలు విషయాన్ని అశోకుడి చెవిన వేశారు – ప్రతీసారి తీరాంధ్రలో ఎదో ఒక కార్యక్రమం కోసం రెండు రోజుల జీతాన్ని విరాళాన్ని ఇస్తోన్న ఉద్యోగులు కనీసం ఈ సారైనా తమ విరాళంలో కొంత కష్టాల కడలిలో ఉన్న సీమకు దక్కుతుందేమోనన్న ఆశతో! సీమ ఎన్జీవోలు చెప్పిన విషయాన్ని ఆలకించిన అశోకుడు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడని సమాచారం.

చదవండి :  కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ పరిస్థితి ఏమిటి?

అశోకుడికి అతివృష్టి విషయంలో ఉన్న సానుభూతి…అనావృష్టి విషయంలో లేదా? లేక ప్రభుత్వ సానుభూతి లేనిచోట తాను సానుభూతి ప్రదర్శించడం ఏవిటీ అనుకున్నాడో ఏమో! ఎవరికెరుక?

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: