అప్పులేని సంసారమైన… అన్నమయ్య సంకీర్తన

అప్పులేని సంసారమైన… అన్నమయ్య సంకీర్తన

అప్పులేని సంసార మైనపాటే చాలు
తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి //

కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు
చింతలేని యంబలొక్క చేరెడే చాలు
జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని //

తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు
ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు
వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని //

చదవండి :  నాలితనా లేఁటికోయి నారసింహుఁడా - చినతిరుమలాచార్య సంకీర్తన

లంపటపడని మేలు లవలేసమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు
రంపపు గోరికకంటే రతి శ్రీవేంకటపతి
పంపున నాతని జేరే భవమే చాలు // అప్పులేని //

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *