ఆదివారం , 6 అక్టోబర్ 2024
అన్బురాజన్‌

కడప ఎస్పీగా అన్బురాజన్‌

కడప : వైఎస్సార్‌ జిల్లాకు కొత్త ఎస్పీగా నియమితులయిన అన్బురాజన్‌ శుక్రవారం కడపలో విధుల్లో చేరారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్‌ ఎస్పీగా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తానని, సమస్య ఏదైనా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చని తెలిపారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మరింత మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్ఫష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణ, మట్కా, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు.

చదవండి :  'శ్రీభాగ్ ప్రకారమే నడుచుకోవాలి' - జస్టిస్ లక్ష్మణరెడ్డి

వైఎస్‌ వివేకానంద హత్య కేసుపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: