మాచుపల్లె శ్రీ రేణుకా యల్లమాంబ వార్షిక తిరుణాల మహోత్సవాలు

సిద్దవటం మండలం మాచుపల్లె గ్రామంలో పవిత్ర పెన్నానది ఒడ్డున  వెలసిన శ్రీ శ్రీ జగజ్జనని రేణుకా యల్లమాంబ వార్షిక  తిరుణాల మహోత్సవాలు వైశాఖ మాసం బహుళ పాడ్యమి నాడు ( మే 5వ తేది ) ధ్వజారోహాణ, అంకురార్పణ కార్యక్రమమలతో సొమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ మాసం బహుళ తదియ రోజున ( మే 6 వ తేదీన ) అమ్మవారి వూరేగింపు, పాట కచేరి జరిగాయి. ( 9 వతేదీ ) అమ్మవారి కళ్యాణం, ఏనుగు వాహనం పై వూరేగింపు,


సిం హ వాహనం పై వైభవంగా అమ్మవారి ఊరేగింపు  అమ్మవారి కథా కాలక్షేపం, పాట కచేరి  జరుగుతాయి.

వైశాఖ మాసం బహుళ పంచమిని పురష్కరించుకుని మే నెల 10 వ తేదీ గురువారం అమ్మవారికి బోనాలు, మొక్కుబడులు చెల్లిస్తారు. ఎద్దులచే బండలాగుడు పోటీ జరుగుతుంది. చెక్క భజనలు, పండరి భజనలు,  వినోద కార్యక్రమాలు జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు.

శూక్రవారం కూడా అమ్మవారి వూరేగింపు, ఎద్దులచే బండలాగుడు పోటీలు జరుగుతాయి.

సంపాదకుడు

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: