కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న హరికిరణ్

కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న హరికిరణ్

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన హరికిరణ్ బదిలీపై వెళుతున్న కలెక్టర్ బాబురావు నాయుడు నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 51 వ కలెక్టరుగా బేస్తవారం పొద్దున 11 గంటలకు కలెక్టరేట్‌లోని ఛాంబరులో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. హరికిరణ్ 2009 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.

ఇక్కడ పనిచేసిన బాబురావు నాయుడు గిరిజన కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న హరికిరణ్ ను ప్రభుత్వం కడప జిల్లా కలెక్టరుగా నియమించింది.

చదవండి :  'కడపను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యండి'

బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడుతూ…కలెక్టర్‌గా నాకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నానని, అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.  జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించి పేదలకు మెరుగైన సేవలందిస్తానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా మీ కోసం కార్యక్రమంలో తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు.

అనంతరం కలెక్టర్‌ కార్యాలయ వివిధ విభాగాల అధికారులతో చర్చించారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *