
శ్రీహరి సేసిన చిహ్నలివి యీ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ శ్రీహరి సేసిన చిహ్నలివి యీ మోహము విడుచుట మోక్షమది ॥చ1॥ మలినంబేది మణుఁగననేది కలుషపుమలముల కాయమిది కలిగిన దేది కడు లేందేది చలనపు మాయల జన్మ మిది ॥చ2॥ తనిసిన దేది తనియనిదేది దినదిన మాఁకలి దీరదిది కొన యిందేది గుఱి మొదలేది పనిగొను కర్మపు బంధ మది ॥చ3॥ నిండినదేది నిండనిదేది కొండల పొడవుల కోరికది అండనె శ్రీవేంకటాధిపు శరణని వుండుటె యిహపరయోగ మది |
రాగము: పాడి రేకు: 0084-02 సంపుటము: 1-406 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి