
వెఱ్ఱివాఁడు వెఱ్ఱిగాఁడు విష్ణుని దాస్యము లేక – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ వెఱ్ఱివాఁడు వెఱ్ఱిగాఁడు విష్ణుని దాస్యము లేక విఱ్ఱవీఁగే యహంకారి వెఱ్ఱివాఁడు ॥చ1॥ నాలుకపై శ్రీహరినామ మిట్టే వుండఁగాను జోలితో మఱచిననీచుఁడే వెఱ్ఱివాఁడు అలరియీజగమెల్లా హరిరూపై వుండఁగాను వాలి తలపోయలేనివాఁడు వెఱ్ఱివాఁడు ॥చ2॥ కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే కోరి వేరె కలఁడనేకుమతి వెఱ్ఱివాఁడు చేరి తనయాత్మలోన శ్రీరమణుఁడుండఁగాను దూరమై తిరుగువాఁడే దొడ్డవెఱ్ఱివాఁడు ॥చ3॥ సారపు శ్రీవేంకటేశు శరణాగతి వుండఁగా సారెఁ గర్మములంటెడి జడుడు వెఱ్ఱివాఁడు చేరువ నాతని ముద్ర చెల్లుబడి నుండఁగా మోరతోపైవున్నవాఁడే ముందు వెఱ్ఱివాఁడు |
రాగము: బౌళి రేకు: 0085-03 సంపుటము: 1-413 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి