ఆదివారం , 22 డిసెంబర్ 2024

మార్చి 5,6 తేదీల్లో అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగజాతర

కడప : రాయలసీమలో పేరొందిన అనంతపురం గంగజాతర శని, ఆదివారాల్లో జరగనుంది. జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. చాగలగట్టుపల్లె నుంచి ఉత్సవ విగ్రహం శనివారం ఉదయానికి జాతర ఆవరణం చేరుకోనుంది. భక్తుల చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారు, గొల్లపల్లె నుంచి మరో గంగమ్మ విగ్రహం జాతరలోకి చేరుకుంటాయి.

ఏటా శివరాత్రి ముగిసిన రెండో రోజే జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ఒక రోజు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ కన్వీనర్‌ టి.పురుషోత్తంరెడ్డి, మేనేజరు ప్రతాప్‌, సర్పంచి అన్నయ్య దగ్గరుండి చూస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. జాతరలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ముస్తాక్‌అహమ్మద్‌, ఎంపీహెచ్‌వో ప్రసాద్‌ చెప్పారు. ఈ సారి పార్కింగ్‌ స్థలాలు మూడు నుంచి అయిదు ప్రాంతాల్లో పెడుతున్నారు.

చదవండి :  ఊహాతీతం - ఈ ఆనందం

వేలం పాట ఆదాయం రూ.5.88 లక్షలు

Gangamma Templeగంగమ్మ జాతర వేలం పాటలో రూ.5.88 లక్షల ఆదాయం వచ్చింది. టోల్‌గేట్‌కు రూ.2.15 లక్షలు, టెంకాయల విక్రయానికి రూ.2.33 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.1.2 లక్షల ఆదాయం వచ్చింది.

భారీ బందోబస్తు

జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. సీఐలు 10 మంది, ఎస్సైలు 13 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 50 మంది, హోంగార్డులు 50 మంది, అయిదుగురు మహిళ పోలీసులు, ఏఆర్‌ పోలీసులను బందోబస్తుకు నియమించారు. చాందినీ బండ్లు కట్టుకునే వారు 16 అడుగుల లోపు ఎత్తు ఉండేలా చూడాలని కోరారు.

చదవండి :  జిల్లాలో బస్సు సర్వీసుల నిలిపివేత

ప్రత్యేక బస్సులు

రాయచోటి డిపో నుంచి 52 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, పులివెందుల, రాజంపేట ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

గంగజాతర ఫోటో గ్యాలరీ…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: