‘రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాల’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజాసంఘాల ఐక్య కార్యాచరణ సమితి కోరింది. సోమవారం ఆ సమితి నేతలు జిల్లా సచివాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతు 1953లో ఉమ్మడి మద్రాసు రాష్రం నుంచి విడిపోయి ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్లో అప్పట్లో రాజధాని ఏర్పాటుకు నిర్ణయించారని గుర్తుచేశారు.
గుంటూరులో ఉన్నత న్యాయస్థానం స్థాపించాలనేది ఒప్పందంలో ఉందన్నారు. 1956లో విశాలాంధ్ర ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చిందని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ రాజధానిగా ఉండేదన్నారు.
తాజాగా 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా సీమ నగరాన్నే ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ప్రజావాణిలో ఉన్న జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి నేతలు అవ్వారు మల్లికార్జున, జేవీ రమణ, ఎస్.మనోహర్, ఇ.బాలవీరప్ప, జి.తిరుపతి, బి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.