పద్మావతమ్మ

మౌనఘోష’ పద్మావతమ్మ ఇక లేరు.!

రాయలసీమ తొలితరం వచన కవయిత్రి , ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు పసుపులేటి పద్మావతమ్మ (76) గురువారం కన్నుమూశారు.

‘మౌనఘోష’ కవితా సంపుటి ద్వారా కవయిత్రిగా పేరుపొందారు. చేరా, పొత్తూరి వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు మౌనఘోష గురించి ప్రత్యేకంగా రాశారు. రాధా మహిళా సమాజాన్ని స్థాపించి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ప్రొద్దుటూరు, కడప పట్టణాల్లో వృద్ధాశ్రమాలను నిర్వహించారు. హాస్పటల్‌ ద్వారా రోగులకు సేవలను అందించడమే కాక అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

చదవండి :  ఆ ఆలోచనే వాళ్లకు లేదు ...

కడపజిల్లా రెడ్‌ క్రాస్‌ జాయింట్‌ సెక్రటరీగా పనిచేశారు. తన సేవలకు గానూ గవర్నర్‌ చేతులమీదుగా దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌ అవార్డు అందుకున్నారు.

పద్మావతమ్మ కొంతకాలంగా కూతురు అనురాధ వద్ద హైదరాబాద్లో ఉంటూ అనారోగ్యం కారణంగా గురువారం తెల్లవారుజామున మరణించారు.

సాహితీవేత్తలు రాచపాలెం చంద్ర శేఖర్ రెడ్డి , రాధేయ, తవ్వా ఓబుల్ రెడ్డి, పాలగిరి విశ్వప్రసాద రెడ్డి , నూకా రాంప్రసాద రెడ్డి , జింకా సుబ్రహ్మణ్యం, ఎన్నెస్ ఖలందర్, ఎస్ ఆర్ ప్రతాపరెడ్డి, సిపిఐ నాయకుడు గుజ్జుల ఓబులేసు, ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి :  హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: