ఆదివారం , 22 డిసెంబర్ 2024

పురంధేశ్వరిపై లక్షా 74 వేల మెజార్టీతో గెలిచిన యువకుడు

రాజంపేట లోక్‌సభ స్థానానికి వైకాపా తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని అధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా చట్టసభకు పోటీ చేసిన మిథున్‌ పార్లమెంటు సభ్యునిగా గెలుపొందడం కూడా విశేషమే.

ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు.

చదవండి :  14న కడపకు రాఘవులు

పురందేశ్వరి, సాయిప్రతాప్ ఇక్కడ మిథున్‌రెడ్డిని ఓడించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. యువకుడైన మిథున్‌రెడ్డి సుమారు 1,74,762 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు. ఇంతటి ఘన విజయం అందించిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వైకాపా అధినేత జగన్ కు స్నేహితుడైన మిథున్ లండన్ లోని షిల్లర్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏలో పట్టభద్రత (2000 సంవత్సరంలో) సాధించారు. అంతకు పూర్వం ఆయన చెన్నైలోని క్రిసెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

చదవండి :  సాయిప్రతాప్ రాజీనామా!

ఇదీ చదవండి!

మారాబత్తుడు

పీనాసి మారాబత్తుడు

తెలుగు వారు మరువలేని ఆంగ్లేయులు కొందరున్నారు.సాహిత్యానికి సేవ చేసిన బ్రౌన్,లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్,స్థానిక చరిత్రలను ఏకరించిన కల్నల్ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: