మంత్రి పదవిపై ఆశలేదంట!

మంత్రి పదవిపై ఆశలేదంట!

‘నాకు మంత్రి పదవిపై ఆశ లేదు. నేను మంత్రి పదవిని కోరుకోవడంలేదు. మంత్రి పదవి రానంత మాత్రాన నిరాశపడను. అధికారం కోసం ఆరాటపడను.’ అని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి అన్నారు. కమలాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తన ధ్యేయం నెరవేరిందని, మంత్రి పదవిని కోరుకోవడం లేదని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని అందరితో కలిసి పనిచేసి 2014లో అత్యధిక ఎంపీ సీట్లను కైవసం చేసుకొని రాహుల్‌ను ప్రధాని చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు.

చదవండి :  వెంకటేశ్వరస్వామికి ఆస్తులు రాసివ్వాలి

ఇంతకీ డి ఎల్ ని పదవీచ్యుతుడిని చేయడమే వీరశివా లక్ష్యమేమో! మొత్తానికి తనకు మంత్రి పదవి రాకపోతే నిరాశపడనని చెప్పడం ద్వారా మంత్రి పదవి రేసులో ఉన్నానని వీరశివా చెప్పకనే చెబుతున్నారా!!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *