శుక్రవారం , 27 డిసెంబర్ 2024

అవినీతిని నిరోధించెందుకే స్థానికుల కోటా రద్దు చేశారట!

మంగంపేట: ముగ్గురాళ్ళ విషయంలో కొంత మంది స్వార్థం కోసం అందరినీ బలిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయనీ తెదేపా రైల్వేకోడూరు నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాధనాయుడు ఆరోపించారు. 15న మిల్లర్లు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాకు పిలుపు ఇచ్చిన నేపధ్యలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంగంపేట పరిధిలోని బడా బయ్యర్లు చిన్నచిన్న మిల్లుల నుంచి రాయిని పొడి గొట్టకుండా నేరుగా అధిక ధరలకు అమ్మడం ప్రారంభించారన్నారు.

చదవండి :  భారతదేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్న మంగంపేట

ఏపీఎండీసీ సంస్థ నుంచి టన్నురాయి రూ.4,500కు కొని, రూ.9,500కు విక్రయించడం జరుగుతుండేదన్నారు. విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లిందని, అవినీతి ప్రక్షాళన చేసేదిశగా మాత్రమే చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. మిల్లుల యజమానులను నష్టపరచాలన్న ఉద్దేశం ఆయనకు లేదన్నారు.

పెద్దమనుషులుగా వ్యవహరిస్తున్నవారికి ఇది తెలిసినా నిజాలను దాచిపెట్టి మిల్లర్లనందరినీ తాము ఉద్ధరిస్తామంటూ అబద్ధాలు చెప్పడం సరైన పద్ధతి కాదని హితవుపలికారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన బంధువునుతెచ్చి మంగంపేటలో రాయిని వెలికితీసే కాంట్రాక్టును అప్పగించారన్నారు. కాంగ్రెస్ హయాంలో అధికారబలం ఉన్నవారు ఇష్టానుసారంగా దోపిడీని కొనసాగించారని ఆరోపించారు. సీఎం గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తున్నారని, ఇందులో పార్టీకి, సీఎంకు లాభం ఉండదన్న విషయాన్ని గమనించాలని సూచించారు.

చదవండి :  'జిల్లా అభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం' : ధర్నాలో సిపిఎం నేతలు

స్థానికులకు కేటాయించిన ముగ్గురాయి విషయంలో ఏవైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే ప్రభుత్వం సదరు అవకతవకలను నిరోధించే విధంగా నిబంధనలు మార్చవచ్చు కదా! అలా కాకుండా ఏకంగా స్థానికుల కోటానే రద్దు చేయడం ఏమిటో…? ఈ విషయం తెదేపా నాయకులకు తెలియదనుకోవాలా! తెలిసినా పార్టీ నిర్ణయాన్ని సమర్ధించక తప్పదు కదా!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: