
పాలదొంగవద్దవచ్చి పాడేరు తమ- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పాలదొంగవద్దవచ్చి పాడేరు తమ- పాలిటిదైవమని బ్రహ్మదులు ॥చ1॥ రోలఁ గటిపైంచుక పెద్దరోలలుగా వాపోవు బాలునిముందర వచ్చి పాడేరు ఆలకించి వినుమని యంబరభాగమునందు నాలుగుదిక్కులనుండి నారదాదులు ॥చ2॥ నోరునిండా జోల్లుగార నూఁగి ధూళిమేనితో పారేటిబిడ్డని వద్దఁ బాడేరు వేరులేని వేదములు వెంటవెంటఁ జదువుచుఁ జేరిచేరి యింతనంత శేషాదులు ॥చ3॥ ముద్దులు మోమునఁగార మూలల మూలలదాఁగే- బద్దులబాలునివద్దఁ బాడేరు అద్దివో శ్రీతిరువేంకటాద్రీశుఁ డితఁడని చద్దికి మేఁడికి వచ్చి సనకాదులు |
రాగము: మలహరి రేకు: 0061-02 సంపుటము: 1-311 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరి