పాపపుణ్యములరూపము దేహ మిది దీని- – అన్నమయ్య సంకీర్తన

పాపపుణ్యములరూపము దేహ మిది దీని- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పాపపుణ్యములరూపము దేహ మిది దీని-
దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు
॥చ1॥
అతిశయంబైన దేహభిమానము దీర
గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు
మతిలోనిదేహభిమానంబు విడుచుటకు
రతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు
॥చ2॥
సరిలేనిమమకారజలధి దాఁటిఁనఁగాని
అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు
తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగాని
పరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు
రాగము: పాడి
రేకు: 0004-08
సంపుటము: 1-28

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి

చదవండి :  తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁ డెవ్వఁడు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: