నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే – అన్నమయ్య సంకీర్తన

నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే – అన్నమయ్య సంకీర్తన

స్వాధీన పతికయైన శృంగార నాయక ఒకతె కడపరాయని లీలలు కొనియాడుచూ, సుతారముగా ఆయనను దెప్పిపొడుస్తూ ‘నీవూ నేనూ ఒకటే కదా. నన్ను చూస్తే నీకెందుకయ్యా అంత భయం’ అంటూ తనని వశపరచుకున్న వైనాన్ని వివరిస్తోంది. అన్నమయ్య గళం నుండి జాలువారిన ఆ సంకీర్తనా మాధుర్యం మీ కోసం…

వర్గం: శృంగార సంకీర్తన
రాగము: సామంతం
రేకు: 0277-5
సంపుటము: 9-161

‘నీకేల వెరపు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

చదవండి :  చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే
కోకొమ్మని విడెమిచ్చీఁ గొంకకువయ్యా ॥పల్లవి

ముందరనె నిలుచుండి ముసిముసి నవ్వునవ్వి
కందువలు నీకుఁ జూపీఁ గలికి యదే
అందుకు నీవెఱఁగక అంకెలకు రాకుండితే
విందులు చెప్పి పిలిచీ వినవయ్యా ॥నీకేల

చాయలకు మాటలాడి సరసముఁ గొంతచూపి
చేయి నీపై వేసీని చెలియ యిదే
నీయంత సన్నెరఁగక నిండుకొని వుండితేను
ఆయములు గోరనొత్తీనదె కదవయ్యా ॥నీకేల

చదవండి :  అన్నమయ్య దర్శించిన ఆలయాలు

కన్నులఁ దప్పక చూచి కరఁగుచు నట్టె మెచ్చి
కన్నె నిన్నుఁ గూడె శ్రీవెంకటవిభుఁడా
యెన్నికై కడపలోన నిట్టె నన్నుఁ గూడితివి
విన్నపము నీకుఁ జేసీ వింటి వటవయ్యా ॥నీకేల


‘నీకేల వెరపు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

(వ్యాఖ్యానం : డా.పాలెం వేణుగోపాల్)

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *