తెలుగుదేశం ఇలా చేస్తోందేమిటో!

తెలుగుదేశం ఇలా చేస్తోందేమిటో!

కడప జిల్లాలో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చే నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో మంతనాలు సాగిస్తున్నారు. జిల్లాలో మకాం వేసిన సీఎం రమేష్ సమీకరణలు కూడగట్టడంలో తలమునకలయ్యారు.కందుల సోదరులు, మేడా మల్లిఖార్జునరెడ్డి, వీరశివారెడ్డి, రమేష్ రెడ్డి (రాయచోటి) సహా పలువురు కాంగ్రెస్ నేతలను దేశంలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తునారు.

ఇప్పటికే వరదరాజులరెడ్డిని పార్టీలో చేర్చుకున్న దేశం నేతలు మిగిలిన వారిపై దృష్టి సారించారు.

చదవండి :  జిల్లాకు మలి విడతలో మంత్రి పదవి:వాసు

శుక్రవారం ఉదయం వీరశివారెడ్డిని కలిసి మంతనాలు సాగించిన సీఎం రమేష్ మధ్యాహ్నం రాజంపేటలో పర్యటించి దేశం సమీకరణలపై దృష్టి సారించారు. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ బాధ్యునిగా ఉన్న మేడా మల్లిఖార్జునరెడ్డిని తెలుగుదేశంలో చేర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డితో కూడా మాట్లాడినట్లు సమాచారం.

మొత్తం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటే ఇంతకాలం అక్కడ పార్టీ వ్యవహారాలు నెరిపిన నేతలు, కార్యకర్తలు అసంతృప్తికి గురికారా? ప్రజల్లో ఇప్పటికే విభజన మూలంగా వ్యతిరేఖతను కూడగట్టుకున్న కాంగ్రెస్ నేతలు దేశంలో చేరితే అది ఆ పార్టీకి బలాన్నిస్తుందా?

చదవండి :  తెదేపాకు మదన్ రాజీనామా

ఏమో! ఇస్తుందేమో … బాబు గారు వ్యూహం లేకుండా ఎవరినీ ఉపయోగించుకోరు కదా! అని సగటు తెలుగుదేశం అభిమానులు సమర్ధిస్తున్నారు. అవును… నిజమే కదా!!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *