కాంతగలనాడు యేకాంతములమాట –  పెదతిరుమలయ్య సంకీర్తన

కాంతగలనాడు యేకాంతములమాట – పెదతిరుమలయ్య సంకీర్తన

తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య,  తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన  పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది ( కాంతగలనాడు …) కూడా ఒకటి.

వర్గం: శృంగార సంకీర్తన
రాగము: రామక్రియ
రేకు: 49-7
సంపుటము: 17-296

చదవండి :  విశ్వవ్యాప్తంగా కడప నారాయణదాసు సంకీర్తనలు

కాంతగలనాడుఁ యేకాంతములమాట, శ్రీ
కాంతుఁడవు నీవు యిందుకొఱకు నా కాఁక లేల కడపరాయ ॥పల్లవి

మానవతి నీవు చనుమానమనఁ బెంచితి నేఁడు
పూని నే మెంత పిలిచిన రా వనుమాన మేల కడపరాయ ॥కాంతగలనాడుఁ

మారుఁ డంతలోనే నీ కుమారుఁ డయ్యండి
మారుకొనె జూడు సారె సారె నెడమాట లేల కడపరాయ॥కాంతగలనాడుఁ

ఆడఁ జెలిఁ జూచి మారాడలేక నీవు
కూడితివి శ్రీవేంకటగిరిపైఁ గోరికమీఱఁ గడపరాయ॥కాంతగలనాడుఁ

చదవండి :  చీరలియ్యగదవోయి చెన్నకేశవా - అన్నమయ్య సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *