కప్పురమందుకొంటిఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

కప్పురమందుకొంటిఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

వర్గం: శృంగార సంకీర్తన
రేకు: 561-4
సంపుటము: 13-302
రాగము: శంకరాభరణం


సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

కప్పురమందుకొంటిఁ గడపరాయ నీకుఁ
గప్పము మా జవ్వనము కడపరాయ ॥పల్లవి॥

కన్నుల మొక్కేనోయి కడపరాయ నా
కన్నెచన్ను లేలంటేవు కడపరాయ
కన్నవారెల్లా నవ్వేరు కడపరాయ నాతో
సన్న లేల సేసేవు సారెఁ గడపరాయ ॥కప్పుర॥

కలఁగంటిఁ గడవోయి కడపరాయ యిఁకఁ
గలఁచకు మాసిగ్గు కడపరాయ
కలువల వేసేవేల కడపరాయ నీకు
మొలకనవ్వులతోడ మొక్కేఁ గడపరాయ ॥కప్పుర॥

చదవండి :  కాంతగలనాడు యేకాంతములమాట - పెదతిరుమలయ్య సంకీర్తన

కరుణించి నన్నేలితి కడపరాయ నీ
గరిమలెల్లాఁ గంటి కడపరాయ
గరిడిసామురతులఁ గడపరాయ నీకు
యిరవు శ్రీవేంకటాద్రి యిట్టే కడపరాయ ॥కప్పుర॥


సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: