గురువారం , 21 నవంబర్ 2024
మనమింతే

కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

కరోనా కారణంగా మృతి చెందిన న్యాయవాది ‘వీణా అజయ్ కుమార్’కు నివాళిగా “కడప ఆకాంక్షలు” పుస్తకం కోసం ఆయన రాసిన వ్యాసం. జనవిజ్ఞానవేదిక ప్రచురించిన ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన అలవలపాటి రఘునాథరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ‘వీణా అజయ్ కుమార్ కడప జిల్లా పౌర సమాజంలో రాజీలేని లౌకికవాదుల్లో ముఖ్యుడు. విద్యార్ధి నేతగా అయన జీవితాన్ని ప్రారంభించినా, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సాధించినా, పార్లమెంటరీ రాజకీయాల్లో విఫల ప్రయోగాలు చేసినా – జనహితం కోసం పని చేయాలన్న తాపత్రయమే ఆయన్ను జీవితమంతా నడిపించింది”.

దశాబ్దాలుగా అనేక రంగాలలో ఎంతో వెనుకబడి ఉన్న రాయలసీమ వెనుకబాటు తనాన్ని ఆసరాగా చేసుకొని ఎన్నో ఉద్యమాలు జరిగాయి. రాయలసీమ ఉద్యమ వేదిక పైన ఎంతో మంది నాయకులు వివిధ రాజకీయ పార్టీలలో చేరి వారు, వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం మినహాయించి రాయలసీమ రైతాంగానికి, అలాగే యువతకు, ఈ ప్రాంత ప్రజానీకానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. కాగా రాయలసీమ నుండి పేరు తెచ్చుకున్న ప్రముఖమైన రాజకీయ నాయకులందరూ దశాబ్ద కాలంలోనే దేశంలోని ఎక్కువ ఆదాయపన్ను చెల్లించేవారుగా పేరు గాంచినారు. అంటే అటువంటి నాయకుల స్వార్థ ప్రయోజనాలకు ఒక మచ్చు తునకగా మనము చెప్పుకోవచ్చు.

రాయలసీమ ప్రాంతములో అన్ని విద్యార్హ్తతలు వున్న లక్షలాది మంది యువతీ యువకులు నిరాశోపహతులై తమ ఉపాధి కోసం రోడ్లపై అవకాశాల కోసం తిరుగుతుంటే, ఇదే రాయలసీమలోనే కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వాల్లో కీలక పదవులు అనుభవిస్తూ ఈ ప్రాంతంలో సమృద్ధిగా దొరికే వనరులను లక్షలాది కోట్లు ఆదాయాలుగా మలుచుకున్నారు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే యువతకు ఎటువంటి ఉపాధి కల్పించే చొరవను చూపకుండా ఆ బాధ్యతలను అరకొరగా ఉన్న ఔట్‌సోర్సింగ్ వ్యవస్థకు వదిలేశారు. ఈ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను కూడా ఆయా నాయకుల అడుగులకు మడుగులొత్తే వ్యక్తులకు అప్పచెప్పి ఔట్‌సోర్సింగ్ అవకాశాల కోసం వచ్చే యువతీ యువకుల నుండి కోట్లాది రూపాయలు కమీషన్ కూడా తీసుకున్న ఘనత ఈ నాయకులకు ఉందని ఈ ప్రాంత ప్రజల్లో న్యాయమైన ఆవేదన వుంది. దురదృష్టవశాత్తు ఈ రకమైన దోపిడి లేదా అస్తవ్యస్త ప్రభుత్వ విధానాలు గత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కీలక పదవులు అలంకరించిన వ్యక్తుల ద్వారా జరిగిందనేది చేదు నిజం.

ఈ నేపథ్యంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఊపందుకున్నాయి. వాటి ఫలితంగా ఆంధ్రపదేశ్ రీ-ఆర్గనైజేషన్ బిల్ 2013 కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించుకుంది. గత పాలకులు లేదా అన్ని పార్టీల నాయకుల నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రాంత ప్రజానీకం నిరక్షరాస్యత కారణంగా రాయలసీమ అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో నూతనంగా 13 జిల్లాలతో ఏర్పాటు కాబోయే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశంపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. అభివృద్ధి అంశాలతో పాటు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ఈ 13 జిల్లాల్లో ఎక్కడ ఏర్పాటుచేస్తే న్యాయసమ్మతంగా వుంటుంది అన్న చర్చ సహజంగానే ప్రారంభమైంది.

చదవండి :  జానమద్ది విగ్రహానికి పూలదండేయడానికి అనుమతి కావాల్నా?

ఈ క్రమంలో 2014 మే 2వ తేదీన అప్పటి కేంద్ర మంత్రి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌లో కీలకమైన వ్యక్తి శ్రీ జైరాం రమేష్ గారు కడపకు వచ్చిన సందర్భంగా ఆయనకు నేను కడప జిల్లా ప్రజల పక్షాన ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. నవ్యాంధ్రపదేశ్‌కు రాజధాని నగరంగా కడప నగరాన్ని ఎంచుకోవాల్సిన చారిత్రక బాధ్యతను ఆయన దృష్టికి తీసుకరావడం జరిగింది. ఎందుకంటే రాయలసీమ అన్ని జిల్లాలకు, అలాగే నెల్లూరు, ఒంగోలుతో పాటు బెంగుళూరు, చెన్నయ్ నగరాలకు కూడా కేంద్ర బిందువుగా కడప నగరం భౌగోళికంగా ఉంది. అంతేకాకుండా అభివృద్ధి పరంగా లేదా కోస్తాంధ్రకు వెసులుబాటుగా ఉండేందుకు గుంటూరు, క్రిష్ణా జిల్లాల మధ్య ఒక ప్రాంతాన్ని రెండవ రాజధానిగా నిర్మించు కోవచ్చు. కడప నగరం రాజధానిగా అభివృద్ధి పరచడం ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం మేరకు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి. అంతేకాకుండా హైదరాబాదులో నెలకొల్పబోయే ఐ.టి.ఐ.ఆర్. (ఇన్ఫర్మేషన్ టెక్నాలజి ఇండిస్ట్రియల్ రీజియన్)లో 60 శాతము నిర్మాణపు పనులను కడప నగరంలో నెలకొల్పవచ్చు. ఫలితంగా యావత్తు రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు అటు ఉక్కు ఫ్యాక్టరీలోను, ఇటు ఐ.టి.ఐ.ఆర్.లోను పుష్కలంగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశముంది.

ప్రయివేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నెలకొల్పబడిన బ్రహ్మణి ఉక్కు కర్మాగారం నిర్మాణం తొలిదశలోనే వివిధ కారణాల రీత్యా ఆగిపోవడం మనకు తెలుసు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు ప్రభుత్వరంగంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలని ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం ద్వారా నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించే దిశగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘సెయిల్’ బృందాన్ని కడప జిల్లాకు పంపింది. ‘సెయిల్’ అధ్వర్యంలోనే ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని నిర్ణయించడం అభినందనీయం. అయితే దశాబ్దాలుగా వివిధ రాజకీయ పార్టీల్లో ఆయా నాయకుల లేదా నాయకుల వారసుల కనుసన్నల్లోనే రాయలసీమకు చెందిన లక్షలాది మంది యువత ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ మంచుదుప్పటి కప్పుకొంది. అటువంటి వారి గుప్పిట్లో నుండి యువతకు భౌతిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిన నాడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నాగరికత అప్పుడే పరిఢవిల్లుతుంది. మెరుగైన ప్రజాస్వామ్య సమాజం వైపుగా మన పయనం సాగుతుంది.

రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత. అంతేకాదు ఆవశ్యకత కూడా! అప్పుడే ఈ ప్రాంతంలో  నాగరికత పరిఢవిల్లుతుంది. మెరుగైన, ప్రజాస్వామిక సమాజం వైపు మన పయనం సాగుతుంది.

చదవండి :  ఈ రాయలసీమ చీకటి ఖండం - పుట్టపర్తి వారి తొలిపలుకు

దశాబ్దాలుగా అనేక రంగాలలో ఎంతో వెనుకబడి ఉన్న రాయలసీమ వెనుకబాటు తనాన్ని ఆసరాగా చేసుకొని ఎన్నో ఉద్యమాలు జరిగాయి. రాయలసీమ ఉద్యమ వేదిక పైన ఎంతో మంది నాయకులు వివిధ రాజకీయ పార్టీలలో చేరి వారు, వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం మినహాయించి రాయలసీమ రైతాంగానికి, అలాగే యువతకు, ఈ ప్రాంత ప్రజానీకానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. కాగా రాయలసీమ నుండి పేరు తెచ్చుకున్న ప్రముఖమైన రాజకీయ నాయకులందరూ దశాబ్ద కాలంలోనే దేశంలోని ఎక్కువ ఆదాయపన్ను చెల్లించేవారుగా పేరు గాంచినారు. అంటే అటువంటి నాయకుల స్వార్థ ప్రయోజనాలకు ఒక మచ్చు తునకగా మనము చెప్పుకోవచ్చు. రాయలసీమ ప్రాంతములో అన్ని విద్యార్హ్తతలు వున్న లక్షలాది మంది యువతీ యువకులు నిరాశోపహతులై తమ ఉపాధి కోసం రోడ్లపై అవకాశాల కోసం తిరుగుతుంటే, ఇదే రాయలసీమలోనే కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వాల్లో కీలక పదవులు అనుభవిస్తూ ఈ ప్రాంతంలో సమృద్ధిగా దొరికే వనరులను లక్షలాది కోట్లు ఆదాయాలుగా మలుచుకున్నారు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే యువతకు ఎటువంటి ఉపాధి కల్పించే చొరవను చూపకుండా ఆ బాధ్యతలను అరకొరగా ఉన్న ఔట్‌సోర్సింగ్ వ్యవస్థకు వదిలేశారు. ఈ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను కూడా ఆయా నాయకుల అడుగులకు మడుగులొత్తే వ్యక్తులకు అప్పచెప్పి ఔట్‌సోర్సింగ్ అవకాశాల కోసం వచ్చే యువతీ యువకుల నుండి కోట్లాది రూపాయలు కమీషన్ కూడా తీసుకున్న ఘనత ఈ నాయకులకు ఉందని ఈ ప్రాంత ప్రజల్లో న్యాయమైన ఆవేదన వుంది. దురదృష్టవశాత్తు ఈ రకమైన దోపిడి లేదా అస్తవ్యస్త ప్రభుత్వ విధానాలు గత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కీలక పదవులు అలంకరించిన వ్యక్తుల ద్వారా జరిగిందనేది చేదు నిజం.

ఈ నేపథ్యంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఊపందుకున్నాయి. వాటి ఫలితంగా ఆంధ్రపదేశ్ రీ-ఆర్గనైజేషన్ బిల్ 2013 కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించుకుంది. గత పాలకులు లేదా అన్ని పార్టీల నాయకుల నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రాంత ప్రజానీకం నిరక్షరాస్యత కారణంగా రాయలసీమ అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో నూతనంగా 13 జిల్లాలతో ఏర్పాటు కాబోయే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశంపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. అభివృద్ధి అంశాలతో పాటు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ఈ 13 జిల్లాల్లో ఎక్కడ ఏర్పాటుచేస్తే న్యాయసమ్మతంగా వుంటుంది అన్న చర్చ సహజంగానే ప్రారంభమైంది.

ఈ క్రమంలో 2014 మే 2వ తేదీన అప్పటి కేంద్ర మంత్రి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌లో కీలకమైన వ్యక్తి శ్రీ జైరాం రమేష్ గారు కడపకు వచ్చిన సందర్భంగా ఆయనకు నేను కడప జిల్లా ప్రజల పక్షాన ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. నవ్యాంధ్రపదేశ్‌కు రాజధాని నగరంగా కడప నగరాన్ని ఎంచుకోవాల్సిన చారిత్రక బాధ్యతను ఆయన దృష్టికి తీసుకరావడం జరిగింది. ఎందుకంటే రాయలసీమ అన్ని జిల్లాలకు, అలాగే నెల్లూరు, ఒంగోలుతో పాటు బెంగుళూరు, చెన్నయ్ నగరాలకు కూడా కేంద్ర బిందువుగా కడప నగరం భౌగోళికంగా ఉంది. అంతేకాకుండా అభివృద్ధి పరంగా లేదా కోస్తాంధ్రకు వెసులుబాటుగా ఉండేందుకు గుంటూరు, క్రిష్ణా జిల్లాల మధ్య ఒక ప్రాంతాన్ని రెండవ రాజధానిగా నిర్మించు కోవచ్చు.

చదవండి :  రేపూ...మన్నాడు ఆస్థానే మురాదియాలో ఉరుసు ఉత్సవాలు

కడప నగరం రాజధానిగా అభివృద్ధి పరచడం ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం మేరకు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి. అంతేకాకుండా హైదరాబాదులో నెలకొల్పబోయే ఐ.టి.ఐ.ఆర్. (ఇన్ఫర్మేషన్ టెక్నాలజి ఇండిస్ట్రియల్ రీజియన్)లో 60 శాతము నిర్మాణపు పనులను కడప నగరంలో నెలకొల్పవచ్చు. ఫలితంగా యావత్తు రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు అటు ఉక్కు ఫ్యాక్టరీలోను, ఇటు ఐ.టి.ఐ.ఆర్.లోను పుష్కలంగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశముంది.

ప్రయివేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నెలకొల్పబడిన బ్రహ్మణి ఉక్కు కర్మాగారం నిర్మాణం తొలిదశలోనే వివిధ కారణాల రీత్యా ఆగిపోవడం మనకు తెలుసు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు ప్రభుత్వరంగంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలని ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం ద్వారా నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించే దిశగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘సెయిల్’ బృందాన్ని కడప జిల్లాకు పంపింది. ‘సెయిల్’ అధ్వర్యంలోనే ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని నిర్ణయించడం అభినందనీయం. అయితే దశాబ్దాలుగా వివిధ రాజకీయ పార్టీల్లో ఆయా నాయకుల లేదా నాయకుల వారసుల కనుసన్నల్లోనే రాయలసీమకు చెందిన లక్షలాది మంది యువత ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ మంచుదుప్పటి కప్పుకొంది. అటువంటి వారి గుప్పిట్లో నుండి యువతకు భౌతిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిన నాడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నాగరికత అప్పుడే పరిఢవిల్లుతుంది. మెరుగైన ప్రజాస్వామ్య సమాజం వైపుగా మన పయనం సాగుతుంది. అంతే కాకుండా రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత. అంతేకాదు ఆవశ్యకత కూడా! అప్పుడే ఈ ప్రాంతంలో  నాగరికత పరిఢవిల్లుతుంది. మెరుగైన, ప్రజాస్వామిక సమాజం వైపు మన పయనం సాగుతుంది.

 

– వీణా అజయ్ కుమార్ 

కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది

(ఆకాంక్షలు పుస్తకం నుండి..)

సౌజన్యం : గాలి త్రివిక్రమ్, అలవలపాటి రఘునాథరెడ్డి

ఇదీ చదవండి!

కడప జిల్లాలో నేరాలు

కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన

రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: