ఆదివారం , 22 డిసెంబర్ 2024

కడపలో కాదు.. కమలాపురంలో తేల్చుకుందాం

కడప : కమలాపురం ఎమ్మెల్యే గతాన్ని గుర్తు చేసుకుని విమర్శలు చేయాలని కడప, కమలాపురం ప్రాంతాల జగన్ వర్గనాయకులు హెచ్చరించారు. 2009 ఎన్నికల్లో మేయర్ రవీంద్రనాథరెడ్డి వచ్చేంత వరకు నామినేషన్ వేయలేని వీరశివా ఇప్పుడు తేల్చుకుందాం అంటూ ప్రగల్భాలు పలుకుతావా అంటూ ప్రశ్నించారు. కడపలో కాదు.. కమలాపురం నియోజకవర్గంలో గీత గీస్తే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు సవాల్ విసిరారు. వాహనాల కుంభకోణంలో పోలీసుల దాడిని తట్టుకోలేక ఆళ్లగడ్డ ఫామ్‌హౌస్‌లో దాక్కున్న ఘనత వీరశివారెడ్డికే దక్కుతుందన్నారు.

వైఎస్ కుటుంబ అండదండలతో రాజకీయంగా ఎదిగిన వీరశివారెడ్డి ఆ కుటుంబాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారని వారు విమర్శించారు. కడప, కమలాపురం ప్రాంతాల్లో మంగళవారం కమలాపురం మాజీ జెడ్పీటీసీ జిలానీబాషా, రాజోలి వీరనారాయణరెడ్డి (ఆర్‌వీఎన్‌ఆర్), కొండాయపల్లె మహేశ్వర్‌రెడ్డి, విభరాపురం సుబ్బరాయుడు విలేకరులతో మాట్లాడుతూ 1994 నుంచి వైఎస్సార్ కుటుంబ అండదండలతో వీరశివారెడ్డి రాజకీయంలో కొనసాగుతున్నారన్నారు.

చదవండి :  గుండాల కోన

ఫామ్ హౌస్‌కు, ఆళ్లగడ్డకు ఆటోలో తిరిగిన రోజులను గుర్తు చేసుకోవాలని సూచించారు. వైఎస్ కాళ్ల మీద పడింటే వాహనాల కుంభకోణం నుంచి విముక్తి కల్పించారని ఇవన్నీ మరచిన వీరశివారెడ్డి వెన్నుపొడుస్తున్నార న్నారు. సీకేదిన్నెలో ఎన్నికల పర్యటన కోసం మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి వచ్చినంత వరకు పడిగాపులు కాసిన వీరశివ నేడు ఆయనపై విమర్శించడం తగదన్నారు. సీఎం నుంచి రూ.10 కోట్లు తెచ్చి ఎంపీటీసీలకు రూ.10వేలు, రూ.5వేలు పంచి మిగిలిన సొమ్మంతా పక్కన పెట్టాడని ఆరోపించారు. జగన్‌కు సత్తా చూపించాలనుకునే ముందు సొంత మండలంలో సత్తా చూపాలన్నారు. సమావేశంలో శంకర్, మోనార్క్ రాజుపాలెం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

చదవండి :  ఈ రోజే మున్సి'పోల్స్'

తండ్రిని చంపిన వారితో డబ్బు కోసం రాజీ అయిన వీరశివారెడ్డి మాజీ మేయర్ పి.రవీంద్రనాథరెడ్డిని విమర్శించడం హాస్యాస్పదమని జగన్ వర్గ నాయకులు పులి సునీల్‌కుమార్, ఎస్‌ఎండి షఫి, ఎస్‌ఎ కరీముల్లా ఆరోపించారు. కడప నగరంలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2009 ఎన్నికల్లో వీరశివారెడ్డి ఎలా గెలిచారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. మహానేత వైఎస్ సూచన మేరకు అందరు కలసి కట్టుగా కృషి చేస్తే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అత్తెసరు మెజార్టీతో బయటపడ్డారన్నారు.

చదవండి :  బడ్జెట్‌ను వ్యతిరేకించండి

ప్రొద్దుటూరులో మట్కాకింగ్‌గా పేరొందిన విషయాన్ని మరచిన వీరశివారెడ్డి స్థాయి మరచి మాజీ మేయర్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగ వాహనాల కేసును మాఫీ చేయించుకోవడానికి శిష్యుడినంటూ వైఎస్ పంచన చేరారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఫ్యాక్షన్ పురికొల్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కడపలో వీరశివారెడ్డి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని అలా గెలిపిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ చేశారు. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడితే సహించమని హెచ్చరించారు. సమావేశంలో జగన్ వర్గ నాయకులు అబ్దుల్ కలాం, ఈశ్వర్‌బాబు, తారకరామారావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

ఒక వ్యాఖ్య

  1. vaahanala donga veera shiva reddy ani anadariki telusu kamalapuram loo kaani vachey yennikallo tala kinda kaallu paiki lepinaa gelavaledu. veellandariki mla cheyyalani meerey aarooju mysoora reddy ki oppose chesaru nedu ravi deggariki vellaru .ravi,veerashiva veelantaa dabbu kosam tama panula kosam mla ga nilabadi 4 kotlu kharchu petti 50 kotlu dandukoney naayakulu.
    kamalapauram abhivruddi kosam okka naayakudaina krushi chesada antey adi ledu kevalam nayakula jebulu nimpendu key veellu pani chestunnaru tappa prajala kosam kaadu. mysoora reddy unnappudu prajala kosam kpm abhivruddi kosam krushi chesaru tappa, ippativaraku kamalapuram oka chinna palley laa ganey undi.
    100 kotla tho kamalapuram abhivruddi kosam nenu town plannig & konni projects kosam parasheelistunnanu .meeru nijamaina naayakulaitey kamalapuram abhivruddi kosam paatu padandi.roads alagey unnai,double road ledu,kamalapuram nu chustey yevaraina navvutaaru busstand ledu depot ledu,rythu seva & callcenter ledu,time ku buses levu,railway gate vadda bridge ledu,ippatiki roads vedalpu cheyyaledu,hospital adhvaannanga undi,kaalvalu levu ,new govt offices levu . raastram loo annitikantey adhvaannanga undi kamalapuram. veerashiva reddy kamalapuram kosam yemi chesadu kondarau naayakulaku tappa. prajala kosam prajala cheta prajaley yennukunna praja prathi nidhulu,kevalam tama kosamey panichetunaadu mla gaa. vachey yenni kallo prajalu chetto kaadu chepputo samadhaanam chebutaaru anduloo nenu kooda untaanu.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: