ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి- – అన్నమయ్య సంకీర్తన

ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి-
నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా
॥చ1॥
అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేక
తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురితకాననములతరిఁ బడి
వెడలలేక నేము విసిగేమయ్యా
॥చ2॥
తెవులువడినవాఁడు తినఁబోయి మధురము
చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగములఁ బడి పరమామృతము నోరఁ
జవిగాక భవముల చవులాయనయ్యా
॥చ3॥
తనవారి విడిచి యితరమైనవారి-
వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లు
అనయము తిరువేంకటాధీశుఁ గొలువక
మనసులోని వాని మఱచేమయ్యా
రాగము: వరాళి
రేకు: 0003-02
సంపుటము: 1-15

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళి

చదవండి :  కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: