ఎనుము అనే పదానికి అర్థాలు, వివరణలు

ఎనుము అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న ఎనుము అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms of the word ‘ఎనుము’ in Telugu Language.

ఎనుము :

నామవాచకం (noun), ఏకవచనం (Singular) – ఎనుములు (బహువచనం)

  • బరిగొడ్డు
  • బఱ్ఱె లేదా బర్రె
  • గేదె
  • బర్రెగొడ్డు
  • ఎనుపసరము
  • ఎనుపగొడ్డు
  • ఎరుమై, ఎరుమైమాడు (తమిళము)
  • She Buffalo (ఆంగ్లం)

వివరణ :

ఎనుము అనేది ఒక పసరము (పశువు). కడప జిల్లాలో ఎనుము అనే పదాన్ని female buffalo అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా వాడతారు. దీనినే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ‘బరిగొడ్డు’ అని కూడా వ్యవహరిస్తారు. కోస్తా ప్రాంతంలో ‘గేదె’ అని తెలంగాణా ప్రాంతంలో ‘బఱ్ఱె’ అని వ్యవహరిస్తారు.

చదవండి :  బేస్తవారం లేదు బేస్తారం అనే పదానికి అర్థాలు, వివరణలు

వాడుక :

  • ఎనుము పోయింది అమ్మయ్యా!
  • పశువుల కొట్టంలో నట్టినడి మధ్యన గుడ్డిబల్బు వెలుతురులో అడ్డంగా పడుంది ఎనుము (‘తలుగు‘ కథ)
  • ఎనుములు తలుగులు ఊడిపిచ్చుకొని పోయినయ్

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *