
ఈరోజు యోగి వేమన విశ్వవిద్యాలయ బంద్
యోవేవి పాలకుల తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం విశ్వవిద్యాలయ బంద్‌కు పిలుపునిచ్చినట్లు రాయలసీమ విద్యార్థి వేదిక కోకన్వీనరు దస్తగిరి, ప్రతినిధి నాగార్జున ఓ ప్రకటనలో తెలిపారు.
విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలు, విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు, పరీక్షల విభాగం ప్రక్షాళన, పీహెచ్‌డీ ప్రవేశాల ప్రకటన వంటి అంశాల సాధన కోసం బంద్ చేస్తున్నామన్నారు.