ఒంటిమిట్ట : కోదండరాముని పెళ్లి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. […]పూర్తి వివరాలు ...
Tags :శ్రీరామనవమి
ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం హైదరాబాదులో తెలిపారు. ఆ రోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కోదండరామాలయాన్నిపరిశీలించిన ప్రిన్పిపల్ సెక్రటరీ స్థానిక కోదండరామాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్పిపల్ కార్యదర్శి ఏవీఎస్ ప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, […]పూర్తి వివరాలు ...
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల ఒంటిమిట్ట కోదండ రామయ్యకు ప్రభుత్వ లాంచనాలు అందుతాయని జిల్లా ప్రజలు ఆశించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కనుందని ఒక వర్గం మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీంతో ఒంటిమిట్టకే రాజ […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లా పట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేపడితే సహించేదిలేదని, ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలను కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు, పీతాంబరాలు సమర్పించేదని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భద్రాచలం తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో […]పూర్తి వివరాలు ...
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే | ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ || ౧ ||పూర్తి వివరాలు ...
అపర అయోధ్యగా కొనియాడబడుతున్న ఏకశిలానగరం ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి పురాణ, చారిత్రక విశేషాలున్నాయి. బహుళ ప్రచారంలో ఉన్న కథనాల కన్నా మరింత ఆసక్తిదాయకమైన విశేషాలు కూడా ఉన్నాయి. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు … ఒంటిమిట్టలో మాత్రమే… రాత్రిపూట కల్యాణం సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ దేవతామూర్తుల కల్యాణోత్సవాలను పగలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రం లో మాత్రమే రాత్రి 11 గంటల తర్వాత నిర్వహిస్తారు. దీనికో పురాణగాథ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. […]పూర్తి వివరాలు ...