‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే […]పూర్తి వివరాలు ...
Tags :రాచమల్లు
ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు […]పూర్తి వివరాలు ...
జిల్లా నుండి గెలుపొందిన శాసనసభ్యులలో తొమ్మిది మంది గురువారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినారు. పులివెందుల శాసనసభ్యుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మేడామల్లికార్జునరెడ్డి (రాజంపేట), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), రఘురామిరెడ్డి (మైదుకూరు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), అంజాద్‌బాషా (కడప), జయరాములు (బద్వేలు), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు)లు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదు. అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణం చేయిస్తుండగా, రవీంద్రనాథ్‌రెడ్డి పేరు పిలిచే సరికి రాహుకాలం వచ్చింది. […]పూర్తి వివరాలు ...
రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక […]పూర్తి వివరాలు ...