Tags :కథ

    కథలు సాహిత్యం

    నవ వసంతం (కథ) – తవ్వా ఓబుల్ రెడ్డి

    విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి కేక వేసినాడు. ”గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా” అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి. ”అబ్బెబ్బే… అదేం లేదులేబ్బా… నరాల జబ్బుతో సేతులు వణుకుతాండయ్‌” సంజాయిషీ చెప్పుకున్నాడు గంగులయ్య.పూర్తి వివరాలు ...

    కథలు

    రాములవారి గుడి ముందు (కథ) – డా|| ఎల్‌.విజయమోహన్‌రెడ్డి

    పుస్తకాల సంచీ బీరువా కింద దాచేసి, సరాసరి వంటింట్లోకి వెళ్ళబోయి, అంతగా పరుగెత్తుకొచ్చినందుకు అత్తయ్య కోప్పడుతుందేమోనన్న విషయం గుర్తొచ్చి గుమ్మంలోనే ఆగిపోయి లోపలికి తొంగి చూశాడు శివు. రంగమ్మ రొట్టెలు చేస్తూంది. చాలా సేపట్నుంచీ పొయ్యిముందు కూర్చుని పనిచేయడం వల్ల ఆమె ముఖమంతా చెమటతో తడిసివుంది. నొసటి కుంకుమ కరిగి ముక్కుమీదుగా కారి చార ఏర్పడింది. ముఖంమీది చెమట బిందువులు పొయ్యి వెలుగులో కెంపల్లా మెరుస్తున్నాయి.పూర్తి వివరాలు ...

    కథలు సాహిత్యం

    దాపుడు కోక (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

    చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.పూర్తి వివరాలు ...