ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇడుపులపాయలో జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను గురువారం వైఎస్ కొండారెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్‌ఛైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పరిశీలించారు.పూర్తి వివరాలు ...
Tags :ysr congress
పులివెందుల ఉప ఎన్నికలలో పరాజయం పాలైన వివేకానందరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవికి రాజనామా చేసిన అనంతరం తనకు పదవి ముఖ్యంకాదని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతనే పదవి చేపడతానని, తన సేవలు అవసరం అనుకుంటే ప్రజలు గెలుపించుకుంటారని వివేకా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అన్న అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన ఆశయసాధనకు కట్టుబడి ఉంటానని, నియోజకవర్గంలో అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులను భుజాలపై వేసుకుని వైఎస్ కలల సాకారం […]పూర్తి వివరాలు ...
కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయిలో రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన భారీ ఆధిక్యత సాధించారు. జగన్మోహన్ రెడ్డి 545672 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయనకు అన్ని నియోజకవర్గాలలో అరవై వేలకు పైగా ఓట్ల మెజార్టీ రావడం విశేషం. కడప లోక్ సభ పరిధిలోని ఏడు […]పూర్తి వివరాలు ...
వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రీపోలింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలనాధికారులు అందించే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడని పులివెందుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయలక్ష్మి ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా మాట్లాడలేదు. అవిడను మాట్లాడవలసిందిగా మీడియా పదే,పదే కోరినా, నవ్వుతూ తిరస్కరించారు. కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీలకు ఉప […]పూర్తి వివరాలు ...
ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసి ఇవిఎంలు పలు కేంద్రాలలో పని చేయకుండా మొరాయించాయి. ఇవిఎంలకు సంబంధించి పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా చాలా కేంద్రాలలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల మధ్యమధ్యలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే 4వ నెంబరు అభ్యర్థికి పడుతోంది. కడపలోని రెండు పోలింగ్ కేంద్రాలలోని ఇవిఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి. బద్వేలులోని ఒక పోలింగ్ […]పూర్తి వివరాలు ...
పులివెందుల: చిరంజీవి పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నసందర్భంలో కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి గురించి ప్రస్తావిస్తుండగా ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది.కొందరు కోడిగుడ్లు చెప్పులు విసిరారు. వై.ఎస్.కు డి.ఎల్ సన్నిహితుడని చెప్పబోతుండగా జనం దానికి నిరసనగా చేతులు ఊపుతూ కనిపించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోలీసులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు చెందినకార్యకర్తలు ఈ పని చేశారని భావించి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. పులివెందుల రోడ్ షోలో జరిగిన ఈ ఘటన కారణంగా కొంత ఉద్రిక్తత […]పూర్తి వివరాలు ...
కడప : ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, విజయమ్మలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఎంపీ సబ్బం హరి కడపకు రానున్నారు. ఇప్పటికే ఆయన జగన్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా…ఎన్నికలు సమీపించేముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించాలని ఆయన భావించారు. జగన్, విజయమ్మలకు ఫ్యాన్‌గుర్తు వచ్చిన శుభసందర్భంలో శుక్రవారం ఆయన కడపకు ప్రయాణం కానున్నారు.పూర్తి వివరాలు ...
హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ‘సీలింగ్ ఫ్యాన్’ను ఎన్నికల కమిషన్ కేటాయించింది. దాంతో జగన్, వైఎస్ విజయమ్మలకు కామన్ సింబల్ లభించింది. ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించడం పట్ల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలు ...
పోరుమామిళ్ల: రాష్ట్రంలో రెండవ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానకి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషే కారణమంటే ఒప్పుకోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కృషి ప్రభుత్వ ఏర్పాటులో ఎంతైనా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి మహిధర్ రెడ్డి అన్నారు. బుధవారం పోరుమామిళ్ల పట్టణంలోని మాజీ శాసన సభ్యుడు వి శివరామక్రిష్ణారావు స్వగృహంలో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో బద్వేలు తాలుకా ఎన్నికల ఇన్‌ఛార్జిగా రాలేదని నాయకుల మధ్య సమన్వయ కర్తగా మాత్రమేవచ్చానన్నారు. ప్రస్తుతం ఏ పార్టీకి […]పూర్తి వివరాలు ...