రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ చిరునామా గల్లంతవుతున్న నేపథ్యంలో గౌరవమైన రాజకీయ ప్రస్థానం కోసం మళ్లీ తెదేపాలోకి వచ్చినట్లు వరదరాజులురెడ్డి చెబుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణం వసంతపేటలోని బుశెట్టి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన తెదేపా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన లింగారెడ్డి మాట్లాడుతూ.. సుస్థిరశాంతి, అభివృద్ధి కోసం చేతులు కలిపితే మా కలియిక అపవిత్రమైందంటూ రాజకీయ లబ్ధి కోసం రాచమల్లు ప్రసాద్‌రెడ్డి గొంతుచించుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఎన్నికలు పూర్తికాగానే వైకాపా […]పూర్తి వివరాలు ...
Tags :varadarajula reddy
ప్రొద్దుటూరులో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజులురెడ్డి టీడీపీ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ నుండి వైకాపా లోకి వెళ్ళిన వరద అక్కడ ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యం కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్తితి కనిపిస్తుండడంతో వరద తెదేపా వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆయన వీటిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వరద చేయలేదు. 2009లో వరదరాజులురెడ్డి కాంగ్రెస్ టిక్కెట్‌పై […]పూర్తి వివరాలు ...