Tags :rachamallu ramachandra reddy

అభిప్రాయం వ్యాసాలు

ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్‌ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు కలిగింది. మా బ్యాచ్‌లో మేము పదిమంది దాకా ఉండేవాళ్ళం. వార్తల్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి ఎలా అనువదించాలో ఆర్నెల్ల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. అనువాదం ఎంత సంక్లిష్టమైనదో అప్పుడే నేను తెలుసుకున్నాను. రా.రా.మాకు శిక్షణ గురువు. తాను సంపాదకీయాలు రాస్తూనే వార్తల్ని ఎలా అనువదించాలో మాకు నేర్పించారు. ఆయన నిండైన విగ్రహం నాకింకా బాగా […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు వ్యాసాలు

సారస్వత వివేచన (వ్యాస సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి

సారస్వత వివేచన ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి వ్యాసాల సంపుటి ‘సారస్వత వివేచన’. 1976 జులైలో ప్రచురితం. ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ. ఇందులో  రారా గారు రాసిన  17 వ్యాసాలున్నాయి.పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు కథలు

అలసిన గుండెలు (కథల సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి

అలసిన గుండెలు ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి కథల సంపుటి ‘అలసిన గుండెలు’. 1960 ఆగస్టులో ప్రచురితం. ప్రచురణ: విద్యోదయ పబ్లికేషన్స్, కడప జిల్లా. ఇందులో రారా గారి 12 కథలున్నాయి.పూర్తి వివరాలు ...

అభిప్రాయం ప్రత్యేక వార్తలు వ్యాసాలు

‘సాహిత్య విమర్శ’లో రారాకు చోటు కల్పించని యోవేవి

తెలుగులో రెండు సంవత్సరాల ఎం.ఏ కోర్సును అందిస్తున్న కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నాలుగవ సెమిస్టర్ లో విద్యార్థులకు ‘తెలుగు సాహిత్య విమర్శ’ (పేపర్ 401) పేర ఒక సబ్జెక్టును బోధిస్తోంది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం, ఆరుద్ర, ఎస్వీ రామారావు, లక్ష్మణ చక్రవర్తి, జివి సుబ్రహ్మణ్యం, బ్రహ్మానంద, వీరభద్రయ్య తదితరుల రచనలకు ఇందులో చోటు కల్పించిన యోవేవి రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన విమర్శా వ్యాసాలకు కనీసం చోటు కల్పించకపోవటం గర్హనీయం.(http://www.yogivemanauniversity.ac.in/fwd/TELUGU.pdf) తెలుగు సాహితీ జగత్తులో విమర్శలో తనదైన ముద్ర […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

కథానికా, దాని శిల్పమూ – రాచమల్లు రామచంద్రారెడ్డి

‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

ఆ రోజుల్లో రారా..

ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

హృదయమున్న విమర్శకుడు – రారా!

రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక […]పూర్తి వివరాలు ...

కథలు

ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా […]పూర్తి వివరాలు ...