పులివెందుల : పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంతో కొనసాగిన విజయమ్మ ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 81వేల 373 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ భారీ మెజార్టీ సాధించి రికార్డు బద్దలుకొట్టారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన బిటెక్ రవి(ఎం.రవీంద్రనాధ్ రెడ్డి) […]పూర్తి వివరాలు ...
Tags :pulivendula
కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయిలో రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన భారీ ఆధిక్యత సాధించారు. జగన్మోహన్ రెడ్డి 545672 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయనకు అన్ని నియోజకవర్గాలలో అరవై వేలకు పైగా ఓట్ల మెజార్టీ రావడం విశేషం. కడప లోక్ సభ పరిధిలోని ఏడు […]పూర్తి వివరాలు ...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు లక్షల మెజార్టీ వస్తే తమ ఆస్తులు రాసిస్తామని చెప్పిన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి సవాలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెసేకు ఓటమి తధ్యం అని ప్రచారం ఊపందుకున్న ప్రస్తుత సమయంలో…ఆ సవాలుకు డీఎల్, వీరశివా కట్టుబడి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. వారు ఉప్పూ, కారం తిని ఉంటే, చీము నెత్తురు, కడప పౌరుషం ఉంటే ఆస్తులు రాసిస్తామనే మాటకు కట్టుబడి […]పూర్తి వివరాలు ...
పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి వివేకానందరెడ్డి భార్య లోక్ సభ ఎన్నికలలో ఎవరికి ఓటు వేశారని భావిస్తున్నారు? లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే పులివెందులలో మొదటినుంచి జగన్ కే మెజార్టీ వస్తుందని, తనకు ఒక ఓటు, జగన్ మరో ఒటు వేస్తారని వివేకానందరెడ్డి చెబుతూవచ్చారు. అదే ప్రకారం మిగిలిన జనం సంగతి ఏమోకాని వివేకానందరెడ్డి భార్య మాత్రం నిజంగానే శాసనసభ ఎన్నిక వరకు […]పూర్తి వివరాలు ...
కడప లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తాజాగా అందిన వివరాల ప్రకారం సుమారు పదిలక్షల ఓట్లు పోలయ్యాయి.అంటే మొత్తం కడప లోక్ సభ నియోజకవర్గంలో 77.48శాతం ఓట్లు పోలైనట్లు నమోదైంది. అత్యధికంగా కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 84.56 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానంలో జమ్మలమడుగు సెగ్మెంట్ ఉంది. ఇక్కడ 83.18శాతం ఓట్లు పోలైనట్లు రికార్డయింది. తదుపరి పులివెందులలో 82.64శాతం ఓట్లు, మైదుకూరులో 81.25శాతం , ప్రొద్దుటూరులో 76.4,బద్వేలులో 75.25శాతం, కడప అసెంబ్లీ […]పూర్తి వివరాలు ...
వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రీపోలింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలనాధికారులు అందించే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడని పులివెందుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయలక్ష్మి ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా మాట్లాడలేదు. అవిడను మాట్లాడవలసిందిగా మీడియా పదే,పదే కోరినా, నవ్వుతూ తిరస్కరించారు. కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీలకు ఉప […]పూర్తి వివరాలు ...
ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసి ఇవిఎంలు పలు కేంద్రాలలో పని చేయకుండా మొరాయించాయి. ఇవిఎంలకు సంబంధించి పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా చాలా కేంద్రాలలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల మధ్యమధ్యలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే 4వ నెంబరు అభ్యర్థికి పడుతోంది. కడపలోని రెండు పోలింగ్ కేంద్రాలలోని ఇవిఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి. బద్వేలులోని ఒక పోలింగ్ […]పూర్తి వివరాలు ...
కడప లోక్ సభ నియోజకవర్గం లో మొదటి గంటలో 15 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రానికి ఎనబైశాతం నుంచి ఎనభై ఐదు శాతం ఓట్లు పోల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.కాగా కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. ఎండల కారణంగా కూడా ప్రజలు ఉదయానే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్ లాల్ వీడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ […]పూర్తి వివరాలు ...
వైఎస్ హయాంలో కడప, పులివెందుల అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉందంటూ… రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజల్లో అసంతృప్తి బీజాలు నాటేందుకు 2009 మే ఎన్నికల సందర్భంగా ‘ఈనాడు’ చేసిన అక్షర రాజకీయమిది. ఇప్పుడు అదే ‘ఈనాడు’ ఇడుపులపాయకు రోడ్డు లేదని, పంచాయతీ కార్యాలయం పెచ్చులూడిందని మరో రకం రాజకీయం మొదలుపెట్టింది. రామోజీకి ఎన్నికల సమయంలో ఎప్పుడూ ప్రకోపించే పైత్యంలో భాగంగానే వైఎస్‌కు కడపకు ఉన్న అనుబంధాన్ని అపహాస్యం చేస్తూ ఈ ఉప ఎన్నికల వేళ కథ(నా)లు రాస్తోంది. […]పూర్తి వివరాలు ...