పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రహ్మతుల్లా కేసు విషయంలో నిన్న రాత్రి పులివెందుల పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేసిన కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 68మందిపై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వీరిపై 11 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. రహ్మతుల్లా అనే పార్టీ కార్యకర్తను పోలీసులు దూషించటంతో పాటు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 […]పూర్తి వివరాలు ...
Tags :pulivendula
కడపః ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో అందుబాటులో ఉంటారు. 9,11 వ తేదీలలో పులివెందులలోని తన క్యాంపు కా ర్యాలయంలో అందుబాటులో ఉంటారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారని పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైన సమయంలోనే జగన్ పర్యటన ఖరారవడం విశేషం.పూర్తి వివరాలు ...
గ్రామాల్లో అనేక తరాలుగా వివిధ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారని చెప్పడానికి కోరవానిపల్లె గొర్రెల కాపరులు నిదర్శనంగా నిలిచారు. తొండూరు మండలం లోని కోరవాని పల్లెలో ఆదివారం (2/9/2011) ముద్దల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి గొర్రెల మందల వద్ద గొర్రెల కాపరులు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా జొన్న ముద్దలుపూర్తి వివరాలు ...
కడప జిల్లా నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది. జిల్లా వాసి వైఎస్ 2004లో సీఎం అయ్యాక అభివృద్ధి పరుగులు తీసింది. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గాను, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాలో యోగివేమన యూనివర్శిటీ, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, పశువైద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలోరూ.130 కోట్లతో రిమ్స్ వైద్య కళాశాలపూర్తి వివరాలు ...
పులివెందుల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నేడు ఇడుపులపాయకు రానున్నారు. హైదరాబాద్‌నుంచి గురువారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి శుక్రవారం ఉదయం ఎర్రగుంట్ల చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు వస్తారు. ఉదయంపూర్తి వివరాలు ...
అది రంగరాజపురం (చెన్నై), నాగార్జున నగర్‌లోని 12వ నెంబరు ఇల్లు … ఆ ఇంటిని చూడగానే ఆలనా పాలనా లేక వెలవెలపోతున్న ఛాయలు స్పష్టంగా కనపడతాయి. అపార్టుమెంటు మాదిరిగా ఉన్న ఆ ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మెట్లపై కూర్చొని ఉన్న వ్యక్తి ఎవరు కావాలంటూ ప్రశ్నించారు. విషయం చెప్పగానే మేడ మీదున్న గది (చిన్న ఇల్లు)లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ హాలులో ఒక చెక్కబల్ల, మూడు కుర్చీలు, ఆ వెనుకాలే గోడకు ‘చింతామణి’ సినిమా పోస్టరు అంటించి ఉన్నాయి. […]పూర్తి వివరాలు ...
లింగాల మండలం కోమన్నూతల గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌ల్లో టీడీపీకి 25ఓట్లు వచ్చాయి. … ఇటీవల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుపై రాళ్ళు విసిరి ఈ గ్రామస్తులు వార్తల్లోకెక్కారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగన్ అవినీతిపై మాట్లాడుతుండగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాబు ప్రసంగానికి అడ్డుతగలడం, తెలుగు దేశం, వై.ఎస్.ఆర్ కార్యకర్తల మద్య మాటల యుద్దం,చంద్రబాబు వాడివాడి వాగ్దానాలు సందించడం తో రెచ్చిపోయిన […]పూర్తి వివరాలు ...
ఇంట గెలవని వారు రచ్చగెలుస్తారా అనేది సామెత. ఇక్కడ డీఎల్, మైసూరా మాత్రం సొంతింట్లో చీదరింపునకు గురయ్యారు. ఓటర్లు వారికి వ్యతిరేకంగా ఓట్లు వేసి తిరస్కరించారు. వారిద్దరూ తమ సొంత నియోజక వర్గాల్లో మెజారిటీ తెచ్చుకోకపోవటం అటుంచి కనీసం జగన్‌కు వచ్చిన ఓట్లకు దరిదాపుల్లో కూడా లేరు. మైదుకూరు నియోజకవర్గంలో డీఎల్‌కు 25,432 ఓట్లు వస్తే అదే నియోజక వర్గంలో జగన్‌కు 95,579 దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ కంటే 71,147 ఓట్లు ఆధిక్యం! తెదేపా అభ్యర్థి మైసూరాకు […]పూర్తి వివరాలు ...
కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభనియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సైకిల్ పంక్చర్ అయ్యింది. ఫ్యాన్ హోరుకు సైకిల్ ఎదురు నిలువలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం తెదేపా నియోజకవర్గ బాధ్యులు రామసుబ్బారెడ్డి డిపాజిట్ దక్కే స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. కడప, మైదుకూర్, బద్వేల్ నియోజకవర్గాల్లో తెదేపా అత్యంత దయనీయమైన స్థితికి పడిపోయింది.పూర్తి వివరాలు ...