Tags :ontimitta

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్ట రామయ్యకు ప్రభుత్వ లాంఛనాలు?

    కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల ఒంటిమిట్ట కోదండ రామయ్యకు ప్రభుత్వ లాంచనాలు అందుతాయని జిల్లా ప్రజలు ఆశించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కనుందని ఒక వర్గం మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీంతో ఒంటిమిట్టకే రాజ […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు

    మార్చి 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

    ఒంటిమిట్ట: కోదండరాముని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మార్చి 27వ తేదీతో ప్రారంభమై, ఏప్రిల్ 6తో ముగియనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తారు. బ్రహ్మోత్సవాల గోడపత్రాలను ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం విడుదలచేశారు. ముఖ్యమంత్రికి స్వయంగా ఒంటిమిట్ట కోదండరాముడి గురించి తాను వివరించానన్నారు. ఒంటిమిట్ట, రామతీర్థం ఆలయాలకు సంబంధించిన నివేదకలను తెప్పించుకొని, పరిశీలించిన పిదప ప్రభుత్వ లాంచనాల విషయంలో ఓ నిర్ణయానికి వద్దామని సీఎం చెప్పారన్నారు. రామాలయానికి దాతల సహకారంతో ఒంటిమిట్ట కొదందరామాలయంలో […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ‘కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాల’

    కడప: జిల్లా పట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేపడితే సహించేదిలేదని, ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలను కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు, పీతాంబరాలు సమర్పించేదని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భద్రాచలం తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    భాగవత పద్యార్చనకు అనూహ్య స్పందన

    ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పోతన సాహిత్యపీఠం మరియు తితిదే ధర్మప్రచారమండలి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం జరిగిన భాగవత పద్యార్చనకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యోగి  వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్‌ పోటీలను ప్రారంభింపద్యార్చనకు హాజరైన విద్యార్థులను చూసి వారు ఆశ్యర్యచకితులయ్యారు. వీరు తెలుగుభాషా గతవైభవాన్ని గుర్తుకు తెస్తున్నారని వైవీయూ ఉపకులపతి శ్యాంసుందర్ అన్నారు. తెలుగుభాషకు సేవ చేస్తున్న […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్టలో టీవీ సినిమా చిత్రీకరణ

    ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవళంలో బుధవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనల టీవీ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆలయ రంగమంటపంలో కొలువరో మొక్కురో.. అనే అన్నమయ్య సంకీర్తనను ఆలపించే దృశ్యాన్ని దర్శకుడు ప్రతాప్‌ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను దృశ్య రూపంలో చిత్రీకరిస్తున్నామన్నారు. షూటింగ్‌ పూర్తయ్యాక ఈ టెలీ ఫిలింను శ్రీవారి పాదాల చెంత వుంచి టీటీడీకి అందజేస్తామన్నారు. అంతకుముందు యూనిట్‌ సభ్యులు స్వామిని […]పూర్తి వివరాలు ...

    పద్యాలు

    బడి పిల్లోళ్ళు రాయాల్సిన భాగవత పద్యాలివే!

    వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వచ్చే 9,10 తరగతులు చదువుతున్న బడి పిల్లోళ్ళు నేర్చుకొని రాయవలసిన పద్యాలు ఇవే అని బమ్మెర పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు తెలియచేశారు. భాగవత పద్యార్చనకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే కింది నెంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు – +91-9441337542 (విద్వాన్ కట్టా నరసింహులు), +91-9440200358 (కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమీషనర్, ధర్మ ప్రచార మండలి). పై పద్యాలను […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్టలో కృష్ణంరాజు

    భాజపా రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. ఆలయ అధికారులు పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను సత్కరించారు. అనంతరం కడపలోని అమీన్‌పీర్ (పెద్ద ) దర్గాను  దర్శించుకున్నారు. భార్య శ్యామలాదేవితో కలసి ఆయన దర్గాలోని ప్రధాన మజార్ వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలోని ఇతర […]పూర్తి వివరాలు ...

    చరిత్ర వ్యాసాలు

    భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

    – విద్వాన్ కట్టా నరసింహులు బమ్మెరపోతన ఆంధ్రమహాభాగవత రచనకు కొన్నాళ్లముందు చంద్రగ్రహణం నాడు గంగలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నాడు. అది మహేశ్వర ధ్యానం. ధ్యానంలో దర్శనమిచ్చినవాడు శ్రీరామభద్రుడు. భాగవతం రచించమన్నాడు. ఆయనకు కలలో కనిపించిన రాముడిలా ఉన్నాడు: మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి ఉవిద చెంగట నుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బఱగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం పర్యాటకం

    “కడప దేవుని గడప” అని ఎందుకంటారో …

    ఒంటిమిట్ట – దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు. ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని […]పూర్తి వివరాలు ...