Tags :kadapa

    రాజకీయాలు

    బాబు రేపు జిల్లాకు రావట్లేదు

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కడప జిల్లా పర్యటన రద్దయింది. ఈనెల 14న రైల్వేకోడూరు, కమలాపురం నియోజకవర్గాల్లో జరిగే జన్మభూమి- మా ఊరు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సభాస్థలి, హెలిప్యాడ్‌ స్థలాలను ఖరారు చేశారు. జిల్లా అధికారులు, టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. బాబు పర్యటనలో జిల్లాపై వరాలజల్లులు కురిపిస్తారని మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. అయితే హుద్‌హుద్‌ తుఫాన్‌ కారణంగా వైజాగ్‌, […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ’14న బాబు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు’

    కడప: ఈనెల 14న కడపజిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కడప విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. నగరంలోని రాష్ట్ర అతిథి గృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రైల్వేకోడూరుకు ఉదయం 10.30 గంటలకు చేరుతారన్నారు. ఓబన్నపల్లెలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు, ఇతర కార్యక్రమాల్లో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    పాఠశాల ఆవరణలో 5 మృతదేహాలు

    కుటుంబ కలహాల కారణంగానే హత్యలు: పోలీసులు కడప: స్థానికంగా ఉన్న ఒక పాఠశాల ఆవరణలో పోలీసులు ఐదు మృతదేహాలను వెలికితీయడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి కడప జిల్లా ఎస్పీ నవీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి పోలీసు కార్యాలయంలో ఎస్పీ  మీడియాకు హత్యలకు దారి తీసిన కారణాలతోపాటు నిందితుల వివరాలను వెల్లడించారు. ఏడాదిన్నర క్రితం అదృశ్యమయ్యారని భావిస్తున్న కృపాకర్ ఐజాక్‌, ఆయన భార్య, పిల్లల మృతదేహాలను జియోన్‌ పాఠశాలలో పూడ్చిపెట్టిఉండగా మంగళవారం పోలీసులు […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఈతకొలను నిర్మాణానికి భూమిపూజ

    కడప: నగరాన్ని క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దుతామని నగరమేయర్ సురేష్‌బాబు అన్నారు. స్థానిక వైఎస్సార్ ఇండోర్‌ స్టేడియం ఆవరణలో సోమవారం ఈతకొలను(స్విమ్మింగ్‌ఫూల్) నిర్మాణానికి నగర మేయర్ సురేష్‌బాబు, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు సీఆర్ఐ సుబ్బారెడ్డి, డీఎస్‌డీవో బాషామొహిద్దీన్, ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఛైర్మన్ తోట కృష్ణ, కేవీఆర్ నిర్మాణరంగ సంస్థ అధినేత కె.విశ్వనాథరాజు తదితరులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ ఈతకొలను నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దాతల సహకారంతో ఈ మొత్తాన్ని […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    14న కడప విమానాశ్రయం ప్రారంభం కానుందా?

    కడప విమానాశ్రయం ఈనెల 14న ప్రారంభం కానుందని ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందిందని ఒక దినపత్రిక ఇవాళ కథనాన్ని ప్రచురించింది. నగరం నుండి విమానాశ్రయానికి దూరాన్ని సూచిస్తూ సూచికలు ఏర్పాటు చేయటం కూడా ఇందుకు నిదర్శమని ఆ పత్రిక పేర్కొంది. ఆ కథనం ప్రకారం ‘విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలని విమానాశ్రయ అధికారులను జిల్లా కలెక్టర్‌ సూచించినట్లు కూడా సమాచారం. జిల్లా కలెక్టరుకు ప్రభుత్వం నుంచి విమానాశ్రయం 14న ప్రారంభించనున్నట్లు మౌఖిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    కడపలో చిరంజీవి మేనల్లుడు

    వర్ధమాన సినీకథానాయకుడు సాయిధరమ్‌తేజ్ సోమవారం పెద్దదర్గాను దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గామహత్యం విని ఇక్కడి వచ్చానన్నారు. దర్గా ప్రతినిధులైన అమీర్‌ను అడిగి దర్గా విషయాలు తెలుసుకున్నారు. గురువుల ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఆయన నటించిన రేయ్, పిల్లానీవులేని జీవితం సినిమాలు విడుదల కావలసి ఉంది. సాయిధరమ్‌తేజ్ ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు.పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాలపై 2 నెలల్లో సెయిల్ నివేదిక

    కడప: కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై  నవంబరు 30లోగా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మేరకు కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి నరేంద్రసింగ్‌తోమార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నాటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. అపాయింటెడ్‌ డే (జూన్‌ 2 నుంచి) ఆరు నెలల లోపు […]పూర్తి వివరాలు ...

    ప్రసిద్ధులు వ్యాసాలు

    ఆ రోజుల్లో రారా..

    ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    మీరు వింటున్నది 103.6 కడప ఎఫ్ఎం

    కడప జిల్లా వాసులకు ఎఫ్ఎం రేడియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశవాణి కడప కేంద్రం ఇంజినీరింగ్ విభాగం డైరెక్టర్ రమణరావు సోమవారం రేడియో సేవలను అధికారికంగా ప్రారంభించారు. 103.6 మెగాహెడ్జ్‌పై కార్యక్రమాలను వినవచ్చు. 1 కిలోవాట్ సామర్థ్యంగల ఈ సేవలు 15కి.మీ. పరిధిలో శ్రోతలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీని సామర్థ్యం భవిష్యత్తులో పెంచేందుకు అవకాశం ఉందన్నారు. ఉదయం 5:55గంటల నుంచి సాయంత్రం 3:00 గంటల వరకు నిరంతరాయంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఇటీవల సాంకేతికంగా ట్రయల్ […]పూర్తి వివరాలు ...