Tags :kadapa katha

కథలు

ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా […]పూర్తి వివరాలు ...

కథలు

కడుపాత్రం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి

”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, బండ్లు కట్టించి, చక్రాలపల్లెకు దారిపట్టించినాడు వెంకటరావు. చక్రాలపల్లె సమీపిస్తున్నకొద్దీ వెంకటరావులో తల్లి ఒడిలోకి చేరుకుంటున్న ఆనందం చోటు చేసుకోసాగింది. ఎనిమిదేళ్ళ […]పూర్తి వివరాలు ...

కథలు సాహిత్యం

దాపుడు కోక (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.పూర్తి వివరాలు ...