ఆదివారం , 22 డిసెంబర్ 2024

Tag Archives: folk songs

బుంగ ఖరీదివ్వరా పిల్లడ – జానపదగీతం

బుంగ ఖరీదివ్వరా

అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని ఒయ్యారంగా నడుస్తూ నీటి కోసం ఏటికి వచ్చింది. ఏటి దగ్గర ఒక కొంటె కోనంగి సరదాపడి రాయి విసిరినాడు. ఆ రాయి గురి తప్పి ఆ గడుసు పిల్ల కడవకు తగిలి …

పూర్తి వివరాలు

వదిమాను సేనుకాడ : జానపదగీతం

దూరం సేను

అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా ఇద్దరం కలిసి తిరిగితే నిన్నూ, నన్నూ ఛీ కొడతారంది మరదలు. అందుకతడు నేను ధర్మం తప్పేవాన్ని కాదు అన్నాడు. ఎన్నో ఆశలు చూపినాడు. ఏది ఏమైనా పెళ్ళైన పెళ్లి తర్వాతనే నీ …

పూర్తి వివరాలు

బండీరా..పొగబండీరా… జానపదగీతం

బండీరా

వర్గం: కోలాటం పాట పాడటానికి అనువైన రాగం: హనుమత్తోడి స్వరాలు (తిశ్రం) బండీరా..పొగబండీరా దొరలేక్కే రైలూబండీరా దొరసానులెక్కే బండీరా అది జాతోడెక్కే బండీరా ||బండీరా|| బండీ సూస్తే ఇనుమూరా దాని కూతెంతో నయమూరా రాణీ లెక్కేది బండీరా రాజూ లెక్కేది బండీరా ||బండీరా|| పయనమంటె రైలుబండీ బయలుదేరుతాదన్నా బుగ బుగ సేలల్లో బుగ్గటించెను …

పూర్తి వివరాలు

నా కొడకా నాగయో…. జానపదగీతం

ఒక తల్లి తైలవర్ణ చిత్రం (చిత్రకారుడు: మురళి)

వర్గం: కలుపు పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏకతాళం) దాయాదుల కారణంగా కొడుకు వ్యసనాలు మరిగి చివరకు జైలు పాలయినాడు. సర్కారోల్లు ఇంటికొచ్చి కొడుకుకు బేడీలు వేసి తీసుకుపోవటంతో అవమానపడిన ఆ తల్లి బాధతో రగిలిపోయింది. ఆ తల్లి బాధను జానపదులు ఇలా పాటగా పాడినారు.. నగుమాసం నినుమోసి నినుకంటిరో …

పూర్తి వివరాలు

బొబ్బిళ్ళ నాగిరెడ్డిని గురించిన జానపదగీతం

Kuchipudi

బొబ్బిళ్ళ నాగిరెడ్డి గడేకల్లులో వెలసిన భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఇతడు శ్రీమంతుల ఇల్లు దోచి బీదలకు పంచి పెట్టేవాడట. పట్టపగలు నట్ట నడివీధిలో ప్రత్యర్ధులు నాగిరెడ్డిని హతమార్చినారుట. ఆ సంఘటనను జానపదులు ఇలా పాటగా పాడినారు… చుట్టూ ముట్టూ పల్లెలకెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి డెబ్బై ఏడు పల్లెలకెల్లా దేవుడమ్మా భీమలింగ …

పూర్తి వివరాలు

రాసెట్టి రామయ్యను (ఆదోని) గురించిన జానపదగీతం

Kuchipudi

వర్గం : కోలాటం  పాట బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా ఆదోని తాలూకురా రాసెట్టి వీరన్న కొడుకే రాయల వాడే రామయ్య రామా రామా కోదండరామా భై రామా రామా కోదండరామా రాసెట్టి వీరన్నకయితే ఎంతమంది కొడుకుల్లు ఒగరి పేరు రామయ్య ఒగరి పేరు సుబ్బయ్య అందరికంటే చిన్నావాడు అందగాడూ విశ్వనాధు …

పూర్తి వివరాలు

‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

Kuchipudi

వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు । తాటి తోపులో పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన తన నడుముకు కట్టమంటది మా వదిన ।వదినకు । చెరువులొ ఉండే కప్పల్ని చూసి బోండాలంటది మా వదిన …

పూర్తి వివరాలు
error: