కడప: ఎంసెట్-2016 పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష రోజున ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్టు చూపించి ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కడప, ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండుల నుంచి పరీక్షా కేంద్రాల వరకు ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలియచేశారు. కడప: ఎంసెట్-2016 పరీక్ష […]పూర్తి వివరాలు ...