దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ౩౦ వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని ఆలయ పర్యవేక్షణాధికారి ఈశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయశుద్ధి కార్యక్రమం చేపడతామని తెలిపారు. శ్రీవారి దర్శనం భక్తులకు ఈ సమయంలో ఉండదన్నారు. 11 గంటల నుంచి యథావిధిగా స్వామి దర్శనం కొనసాగిస్తామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ప్రారంభమవుతాయన్నారు. ప్రతిరోజు ఉదయ […]పూర్తి వివరాలు ...
Tags :devuni kadapa
Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...
కడప : ఆహ్వానం టెలీ సీరియల్‌కు సంబంధించి ఈనెల 17వతేదీవరకు కడప నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు. ప్రారంభ సన్నివేశాలను శనివారం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయంలో సినీనటుడు మురళీమోహన్‌పై చిత్రీకరించారు. ప్రార్థనా సన్నివేశాన్ని శ్రీవారి పాద మండపం వద్ద చేశారు. సీరియల్‌లో కథానాయకి నవ్యశ్రీ, శ్రీరామ్ తదితరులపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిరంజీవి చిత్రీకరించారు. రమా ఫిలిమ్స్ బ్యానర్‌పై 10ఎపిసోడ్ల టెలిఫిలిం నిర్మిస్తున్నామని నిర్మాత మోపూరి వెంకటసుధాకర్ తెలిపారు. మురళీమోహన్‌ను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు. […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రం దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం. తిరుమలకు తొలి గడపగా పేరున్న ఈ క్షేత్రంలో యేటా జరిగే తిరుణాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. కడప రాయునిగా, వెంకటాద్రి కడప రాయనిగా, కప్పురపు నవ్వుల కడప రాయనిగా భక్తుల పూజలందుకుంటున్న ఈ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకూ నిర్వహిస్తారు. రథసప్తమి నాడు జరిగే రథోత్సవం ‘దేవునికడప’ తిరుణాలగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.పూర్తి వివరాలు ...