Tags :రాయచోటి

    రాజకీయాలు

    పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే!

     ఈరోజు కడప కార్పొషన్‌తోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి పురపాలికల పాలకవర్గం కొలువుదీరనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కార్పొరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కడపలో మేయర్, డిప్యూటీ మేయర్, ఆయా పురపాలక సంఘాలలో చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎంపికకు ఎన్నికలు జరుగన్నాయి. కలెక్టర్ కోన శశిధర్ కడప కార్పొరేషన్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కొత్త పాలకవర్గాల ఎన్నికకు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని  మున్సిపాలిటీలు ముస్తాబయ్యాయి. ఎన్నికకు కేవలం […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ప్రమాణ స్వీకారం చేసినారు…ఆయనొక్కడూ తప్ప!

    జిల్లా నుండి గెలుపొందిన శాసనసభ్యులలో తొమ్మిది మంది గురువారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినారు. పులివెందుల శాసనసభ్యుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మేడామల్లికార్జునరెడ్డి (రాజంపేట), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), రఘురామిరెడ్డి (మైదుకూరు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), అంజాద్‌బాషా (కడప), జయరాములు (బద్వేలు), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు)లు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదు. అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణం చేయిస్తుండగా, రవీంద్రనాథ్‌రెడ్డి పేరు పిలిచే సరికి రాహుకాలం వచ్చింది. […]పూర్తి వివరాలు ...

    పాఠశాలలు

    గుర్తింపులేని బడులివే

    2014-15 విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపధ్యంలో జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వివరాలను జిల్లా విద్యాధికారి అంజయ్య వెల్లడించారు. ఎంఈవోలు మండల తహసీల్దార్ల సహకారంతో మండలంలో గుర్తింపులేని పాఠశాలలను మూసివేయాలని డీఈవో ఆదేశాలిచ్చారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. లేనిపక్షంలో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రకటించిన గుర్తింపులేని పాఠశాలలివే కడప నగరం  – సాయిపేట మాస్టర్స్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల – మాసాపేటలోని సాయి ఆంగ్లమాధ్యమ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    రాయచోటి శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు?

    2014 సార్వత్రిక ఎన్నికలలో రాయచోటి నుండి మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరారు. వీరిలో వైకాపా తరపున బరిలోకి దిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపొందారు. పోటీ చేసిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు … గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా – 96891 ఆర్ రమేష్ కుమార్ రెడ్డి – తెదేపా + భాజపా – 62109 మండిపల్లి రాంప్రసాద్  రెడ్డి – జైసపా – 3272 ఎం […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    రాయచోటి శాసనసభ బరిలో ఉన్న అభ్యర్థులు

    రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ మరియు పరిశీలన బుధవారం (23న) పూర్తయింది. నామినేషన్ల పరిశీలించే సందర్భంలో అధికారులు ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మరొకరు నామినేషన్ ఉపసంహరించుకుని పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరేందుకు సిద్దమయ్యారు. రాయచోటి నియోజకవర్గం (శాసనసభ స్థానం) నుండి తుది పోరులో నిలవనున్న  అభ్యర్థులు వీళ్ళే! ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు తొందరలోనే ఎన్నికల గుర్తులను కేటాయించి అనంతరం 14 […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    రాయచోటి శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    రాయచోటి శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు రాయచోటి శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా … 1 గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    మొదటి దశలో 80.40 శాతం పోలింగ్

    స్థానిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల మొదటి దశ పోరులో జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 29 మండలాల పరిధిలో 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 80.40 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది.పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

    తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఈ రోజే మున్సి’పోల్స్’

    కడప జిల్లాలో నేడు నగర పాలకం, పురపాలకంలో ఎన్నికల జరగనున్నాయి. కడప నగర పాలకంలో 50 డివిజన్లలో 311 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 47 మంది, వైకాపా తరపున 50 మంది, సిపియం తరపున 12 మంది, బిజెపి తరపున 7మంది, సిపిఐ తరపున ఇరువురు, కాంగ్రెస్ తరపున 8 మంది, ఎంఐఎం, బిఎస్‌పి, లోక్‌సత్తా, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప నగర పాలకంలో […]పూర్తి వివరాలు ...