Tags :యోవేవి

రాజకీయాలు వార్తలు

తెదేపా నేతపై కేసు నమోదు

కడప యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి లక్ష్మీప్రసాద్‌ను దూషించినందుకు  తెదేపా నేత, బసవరామతారకం న్యాయ కళాశాల అధిపతి ఎస్.గోవర్ధనరెడ్డిపై పెండ్లిమర్రి పొలీసు స్టేషనులో 506 సెక్షన్ కింద కేసు నమోదైంది. యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి, బాధ్య కులసచివులు ఆచార్య సాంబశివారెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పొలీసులు, ఫిర్యాదుదారుల వివరాల మేరకు పది రోజుల కిందట గోవర్ధన్‌రెడ్డి ఫోన్‌లో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్‌ను […]పూర్తి వివరాలు ...

వార్తలు వ్యాసాలు

తెలుగు సాహిత్యం తీరుతెన్నులపై జాతీయ సదస్సు

యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ’21వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లోని సదస్సుల గదిలో బుధవారం మొదలైంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సమాజ కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆచార్య కుసుమకుమారి మాట్లాడుతూ వికీపిడియా వంటి వెబ్‌సైట్‌లు వేల పుటల్ని సాహిత్య అభిమానులకు అందిస్తున్నాయని వివరించారు. అలాంటి మాధ్యమాలను తెలుగు రచయితలు, పరిశోధకులు తప్పక ఉపయోగించుకోవాలన్నారు. […]పూర్తి వివరాలు ...

వార్తలు

బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి

యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య బేతనభట్ల శ్యామ్‌సుందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు, డీన్‌లతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విశ్వవిద్యాలయంలోని కుటుంబసభ్యులందరినీ కలుపుకుని తన శాయశక్తులా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానని తెలిపారు. యోగి వేమన పేరుతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలో పనిచేయడం అదృష్టమన్నారు. ఆయన ప్రబోధనలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధికి పాటుపడతామన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగించి విశ్వవిద్యాలయానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ […]పూర్తి వివరాలు ...