అతడు : తుమ్మేదలున్న యేమిరా… దాని కురులు కుంచెరుగుల పైన – సామంచాలాడెవేమిరా ఆమె : ఏటికి పోరా శాపల్ తేరా – బాయికి పోరా నీళ్లు తేరా బండకేసి తోమర మగడ – సట్టికేసి వండర మగడా శాపల్ నాకు శారూ నీకూరా ఒల్లోరె మగడా! బల్లారం మగడా బంగారం మగడా… …
పూర్తి వివరాలుభరతుడా! నా చిన్ని తమ్ముడా (చెక్కభజన పాట)
ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో! పితృవాక్య పరిపాలనకై శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు వచ్చినాడు. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. వచ్చిన తర్వాత జరిగిన ఘోరానికి బాధపడి తల్లి కైక దురాశను నిందించి అడవిలో …
పూర్తి వివరాలుకల్లు గుడిసెల కాడ – జానపదగీతం
వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల పడినాడు. వాడి (దు)స్థితిని జానపదులు హాస్యంతో కూడిన ఈ జట్టిజాం పాటలో ఎలా పాడుకున్నారో చూడండి. వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శంకరాభరణం స్వరాలు (తిశ్ర ఏకతాళం) కల్లు …
పూర్తి వివరాలుదొరవారి నరసింహ్వరెడ్డి! – జానపదగీతం
దొరవారి నరసింహ్వరెడ్డి! నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహ్వ రెడ్డి! || దొర || రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా దొరవారీ వమిశానా ధీరుడే నరసింహ్వ రెడ్డి || దొర || కొయిల్ కుంట్లా గుట్టలెంటా కుందేరూ వొడ్డూలెంటా గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర || కాలికీ …
పూర్తి వివరాలురాసెట్టి రామయ్యను (ఆదోని) గురించిన జానపదగీతం
వర్గం : కోలాటం పాట బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా ఆదోని తాలూకురా రాసెట్టి వీరన్న కొడుకే రాయల వాడే రామయ్య రామా రామా కోదండరామా భై రామా రామా కోదండరామా రాసెట్టి వీరన్నకయితే ఎంతమంది కొడుకుల్లు ఒగరి పేరు రామయ్య ఒగరి పేరు సుబ్బయ్య అందరికంటే చిన్నావాడు అందగాడూ విశ్వనాధు …
పూర్తి వివరాలుదానపరుడూ యంగళరెడ్డి …! – జానపద గీతం
వర్గం: భిక్షకుల పాట అనువైన రాగం : సావేరి స్వరాలు (ఏక తాళం ) ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం సూడరయా నేటికి బుడ్డా యంగలరెడ్డి ధర్మ పెబువని పాడరయా దానపరుడూ యంగళరెడ్డి ధర్మదేవత బిడ్డడయా పచ్చి కర్వులో పాసెమూ పోసేను బెమ్మదేవుడే ఆయనయా ||ఉత్తరాది|| యెచ్చుగానూ పుణ్యాత్ముడు రెడ్దని యంగళరెడ్డిని ఎంచరయా …
పూర్తి వివరాలుఆరవేటి శ్రీనివాసులు – కళాకారుడు
నాటికలు నాటకాలు రాసి ఒప్పించాడు – నటించి మెప్పించాడు – ప్రయోక్తగా రాణించాడు – పాటను పరవళ్ళు తోక్కించాడు – మిమిక్రీతో అలరించాడు – కథలతో ఆలోచింపజేశాడు. కథ చెప్పి ఎదుటివాళ్ళను మెప్పించడంలో గొల్లపూడి మారుతీరావు అందెవేసిన చేయి అని విన్నాను. అనుభవానికి రాలేదు. అయితే ఆ అద్భుత ప్రయోగాల్లో ఆరవేటి తనకు తానే సాటి.
పూర్తి వివరాలుకలిమిశెట్టి మునెయ్య – జానపద కళాకారుడు
ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు …
పూర్తి వివరాలుబేట్రాయి సామి దేవుడా! – జానపద గీతం
బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా 1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ 1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి …
పూర్తి వివరాలు