Tags :జట్టిజాం పాట

    జానపద గీతాలు

    ఏమే రంగన పిల్లా – జానపదగీతం

    ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి. వర్గం: జట్టిజాం పాట (బృందగేయం) పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ స్వరాలు (మధ్యాది తాళం) ఏమే రంగన పిల్లా నీ మకమే సిన్నబాయ – సెప్పే పిల్లా ఆలూరు సంతాకు పోతాన్ పిల్లా అడిగినన్ని […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    కసువు చిమ్మే నల్లనాగీ… జానపదగీతం

    సంసారమనే  శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. దానిని సరిచేయటానికి ఒక మనిషంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణ పాట రూపంలో… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: హిందుస్తాన్ తోడి రాగస్వరాలు (ఏకతాళం) భర్త: కసువు చిమ్మే నల్లనాగీ                 గురిగింజ గుమ్మడి భార్య: సిమ్మను పోరా సిమ్ముకో పోరా     గురిగింజ గుమ్మడి భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ         గురిగింజ గుమ్మడి భార్య: […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    సుక్కబొట్టు పెట్టనీడు… జానపదగీతం

    అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది.  సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం) సుక్కబొట్టు పెట్టనీడు సుట్టాల సూడనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు కాయిలుంటడో పచ్చబొట్టు పెట్టనీడు పసుపుసీరె కట్టనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    కల్లు గుడిసెల కాడ – జానపదగీతం

    వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల పడినాడు. వాడి (దు)స్థితిని జానపదులు హాస్యంతో కూడిన ఈ జట్టిజాం పాటలో ఎలా పాడుకున్నారో చూడండి. వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శంకరాభరణం స్వరాలు (తిశ్ర ఏకతాళం) కల్లు గుడిసెల కాడ – కల్లు గుడిసెల కాడ కయిలాసం పోతాండ్య కొన్నాల్లూ కల్లు తాగి వాడింటికీ వచ్చాంటే పెండ్లాము తన్నింది కొన్నాల్లూ దొరల […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    సీరల్ కావలెనా – జానపద గీతం

    వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: హిందుస్తాని తోడి రాగస్వరాలు (ఆదితాళం) అందమైన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పడుచు. అందుకే బావ చీరెలూ, సొమ్ములూ తెచ్చిస్తానని సెప్పినా వద్దంటుంది ఆ మరదలు పిల్ల. ఆ మరదలు పిల్ల మనసులోని మాటను జానపదులు ఇలా పాటలా పాడుకుంటారు… సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా నీకేం కావాలనే మైదుకూరు సంతలోనా సీరల్ నా కొద్దురో – రయికల్ నా కొద్దురో […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    అమ్మమ్మో ..నా లడీసు మొగుడూ – జానపదగీతం

    వర్గం : జట్టిజాం పాట అనువైన రాగం: నాదనామక్రియ స్వరాలు (తిశ్రగతి) ఏమిసేతురా బగమతి గురుడా మొగుడు ముసలివాడు బెమ్మరాతర రాసిన వానికి తగులును నా ఉసురు అందరి మొగుళ్ళు సెరువుకు పోయి శాపల్ తెచ్చాంటే అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ కాలవకు పోయి కప్పలు తెచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు బీదరు పోయి బిందెలు తెచ్చాంటే నా లడీసు మొగుడూ బీదరు పోయి బిత్తర పోయొచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు పంచల్ కట్కోని […]పూర్తి వివరాలు ...