కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక కథ: కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప […]పూర్తి వివరాలు ...
Tags :కడప
కడప: కడప నుంచి విశాఖపట్నానికి ఇంద్ర బస్సు సర్వీసును ఆదివారం సాయంత్రం డిపో అధికారులు ప్రారంభించారు.ఈ బస్సు ప్రతి రోజు సాయంత్రం కడప డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కడపకు చేరుకుంటుంది. కడప నుంచి బద్వేలు, కావలి, ఒంగోలు బైపాస్, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరంల మీదుగా […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట స్ఫూర్తితో ఉద్యమించాల 25, 26వ తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన కడప: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని అఖిలపక్షం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికనేత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి వేడుకలు నిర్వహించాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఫలితంగా […]పూర్తి వివరాలు ...
కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు చెప్పిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు జిల్లాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని వైకాపా ప్రజాప్రతినిధులు కోరగా జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం కేవలం రూ.1.90 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని మరో రెండు కోట్లు […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఈ నెల 13న ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు డాక్టరు ఎన్.సుబ్బనర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు వస్తున్నారన్నారు. ఆ బ్యాంకులో సేల్స్ ఆఫీసరు ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తారన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 26 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు అన్నీరకాల అర్హతాపత్రాలతో నేరుగా హాజరుకావాలని సూచించారు.పూర్తి వివరాలు ...
కడప: ‘రాయలసీమ తొలితరం కథలు’ , ‘సీమ కథా తొలకరి’ పుస్తకాల అవిష్కరణ సభ ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 5-30 గంటలకు ఎర్రముక్కపల్లె సిపి బ్రౌన్‌బాషా పరిశోధన కేంద్రం బ్రౌన్‌శాస్ర్తీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సభ నిర్వహకులు, పరిశోధకుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కథారచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అతిధులకు ఆహ్వానం పలుకుతారని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కర్నూలు కథరచయిత డాక్టర్ ఎమ్ హరికిషన్, ముఖ్యఅతిథులుగా […]పూర్తి వివరాలు ...
ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి (వాహనశాల) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలోని కాగితాలపెంటలో వెలిసిన కాటివాలె సాహెబ్ (ఖుద్-సె-సిర్రహుల్) దర్గాలో శనివారం నుంచి ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఉరుసులో భాగంగా శనివారం రోజు గంధం, ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉరుసు , 2వ తేదీ సోమవవారం నాడు తహ్‌లీల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.పూర్తి వివరాలు ...
కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితుల గురించి అవగాహనతోబాటు బాధ్యతకూడా కలిగిన సీనియర్ నాయకుడిగా ఆయన్నుంచి కడప జిల్లావాసులు ప్రధానంగా కోరుకున్నది నాలుగు విషయాల్లో స్పష్టత – అవి: […]పూర్తి వివరాలు ...