అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ప్రసిద్ధి – శనివారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనార్థం రానున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తిరుణాల్ల నేపధ్యం … అనంతపురం గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి పొలం గట్టుకు కావాల్సిన కంప కొట్టి తొడుగేశారు. తీసుకెళ్లేందుకు కాడెద్దులతో కదిలించగా కదలలేదు. ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలోకి వచ్చి […]పూర్తి వివరాలు ...
Tags :కడప
ఇది ఊహకు అందని విషయమనీ … మీరు నమ్మరనీ మాకూ తెలుసు. మీరు ఈ విషయాన్ని నమ్మాలని మేము కోరుకోవడం లేదు. కాకపొతే అలోచించి చూడండి – మీకే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణను ఊహలకు అందకుండా పార్లమెంటు సాక్షిగా ఆమోదించిన కాంగిరేసు పెద్దలు ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు చెప్పి వైకాపా మరియు తెదేపాలకు తలనొప్పి సృష్టించేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు డిల్లీ పెద్దలు పెద్ద వ్యూహమే రూపొందించినట్లు నిఘా వర్గాల సమాచారం. […]పూర్తి వివరాలు ...
కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో అఖిల భారత బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని […]పూర్తి వివరాలు ...
తెలుగు సాహితీ పుస్తకాల ప్రచురణ, అమ్మకాలలో అగ్రగామిగా పేరు గాంచిన విశాలాంధ్ర సంస్థ కడప నగరంలో పుస్తకాల అంగడిని ఏర్పాటు చేసింది. స్థానిక నాగారాజుపేటలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ పుస్తకాల అంగడిని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాలాంధ్ర 16 పుస్తకాలయాలు నిర్వహిస్తున్నట్లు విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ హరినాథరెడ్డి, బాధ్యుడు రామసుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్, […]పూర్తి వివరాలు ...
టోర్నీకి వివిధ రాష్ట్రాల నుండి 500 మంది కడప: నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 4 నుంచి 10 వరకూ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏపీ బ్యాడ్మింటన్ రాష్ట్ర కార్యదర్శి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి(ఈవెంట్) పున్నయ్య చౌదరి ప్రకటించారు. ఆల్ ఇండియా సబ్‌జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహణ విషయమై ఏజేసీ సుదర్శన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పున్నయ్య చౌదరి, వైస్సార్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి రామచంద్రారెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, […]పూర్తి వివరాలు ...
మా కడప జొన్నన్నం, రాగిసంగటీ, అలసంద వడలూ… కారెం దోసె 56 సంవత్సరాల జీవితంలో సుమారు వెయ్యి పైచిలుకు చిత్రాలలో వివిధ రకాలైన పాత్రలలో నటించిన వై విజయ (యెనిగండ్ల విజయ) తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. నృత్యకళాకారిణి కూడా అయిన విజయ ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వద్ద నృత్యం నేర్చుకున్నారు. నటించడమంటే ఏంటో తెలియని చిన్న వయస్సులోనే దర్శకులు చెప్పినట్టు చేసి తొలి షాట్‌ను ఓకే చేసిన విజయ అటు నృత్యంలోను, ఇటు నటనలోనూ రాణించారు. […]పూర్తి వివరాలు ...
కడప నగరంలో పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని సిటీ బస్సులు నడపాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నిర్మల అన్నారు. శుక్రవారం నగరం, పురపాలక సంస్థ కమిషనర్లు, అర్టీసీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు పురపాలకలో కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అందుకు పురపాలక సంస్థల అధికారులు సహకరించాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, భూసేకరణ, రోడ్లు వెడల్పు, ఆక్రమణలు, తదితరాలపై సమీక్షించడం […]పూర్తి వివరాలు ...
1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు. అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు […]పూర్తి వివరాలు ...
రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక […]పూర్తి వివరాలు ...