Tags :సడ్లపల్లె చిదంబరరెడ్డి

కవితలు

వీర ప్రేక్షకులు (కవిత)

వాడి కాగితాల చూపుల్నిండా టన్నుల కొద్దీ వ్యూహాలు. తన తల్లో వండిన కలలుగానే కొత్త రంగులు పూస్తుంటాడు కొలతలేసి చూపుతుంటాడు. మాటల గాలిపటాల్ని గీసి మిరుమిట్ల మిణుగుర్లతికించి హద్దుల్లేని ఆకాశంలో మేకే అందని అతి ఎత్తుల్లో ప్రదర్శనలు సాగిస్తుంటాడు. కలలెందుకు కనాలో కన్న కలలకు దార్లెలా వేయాలో ప్రయత్నించే మీరు మీ మేధస్సే మరచి వాడి మాటల గాలాల ఆటలకు మంచి ప్రేక్షకుల్లా తయారౌతారు!! వాడు మార్చే మాటవెనుక మాట ఆడే ఆటవెనుక ఆటల రసవత్తర ఘట్టాల్లో […]పూర్తి వివరాలు ...

పాటలు

ఏందిర ఈ సీంబతుకు (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

చింతల చీకట్లో–రైతన్నల కన్నీళ్లు వలసల వాకిట్లో–కూలన్నల పడిగాపులు కొలువుల పిలుపుకై–చదువరులా ఎదురుచూపు ఏందిర ఈ సీంబతుకు–ఎన్నాళ్లీ దేబిరింపు //చింతల// సీమ బీడు సాకుజూపు–నీటి వాట తెస్తారు వాన రాలేదనిఏడ్చి– రాయితీలు రాబట్తరు రాజకీయ రాబందులె–పంచేసు కొంటారు పల్లె జనాల నోట –దుమ్ము కొట్టుతుంటారు //చింతల// నీరు మీరు అంటారు–కన్నీరై కారుతారు కాళ్లబేరానికొచ్చి–ఓట్లనడుక్కు తింటారు కుర్చీలు ఎక్కగానె–కొండచిలువలైపోయి దిగమింగే కార్యాన్ని– దీక్ష తోన చేస్తారు //చింతల// వానలుకురిసే చోటుకు–వరదలు పొంగేనేలకు ప్రాజక్టుల నీళ్లన్నీ–సంతర్పణ చేస్తారు ఎడారి బీడు సీమకేమొ– […]పూర్తి వివరాలు ...

పాటలు

కొత్తసీమ (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

చర్న కోల ఏదిరా-బండిగుజ్జ వెదకరా వడిశెలా చెల్లెమ్మా-మొద్దొ పరక తీయమ్మా //చర్న// వాడెవడో నిజాముగాడు మననమ్మెనంట తెల్లోనికి ఇంకెవడో ఖద్దరోడు ముక్కలుగా నరికెనంట. అరవ నాడులో చేతులు కన్నడ దేశాన తలా మొండెమే మనమిప్పుడు వంచించ బడిన బిడ్డలం //చర్న// రాజుల కాలం కాదిది- రజకీయ నక్కలార ప్రజల మాట ఆలకించి -పోరాడుదాము రండి సరహద్దుల గీతగీచి -మాసంస్కృతినే చంపినారు కుటుంబాన్ని విడగొట్టి- కుర్చిలాట ఆడినారు //చర్న// లేవండీ కదలండీ- చలిచీమల దండులాగ పాముల పన్నాగాలా- పడగనీడ […]పూర్తి వివరాలు ...

కవితలు

అన్నన్నా తిరగబడు… (కవిత) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

రాయల సీమజనాల్లో రగత మురికిపారాల రాజకీయ రంకుల్ని ఈడ్చి ఈడ్చి తన్నాల. ఈపొద్దు ఇంటిలోన రేపేమో మంటిలోన ఏదొకటో కాకుంటే మనకింకా ముక్తి లేదు. ఒకకంటికి సున్నము వెన్న మరో కంటికి ఆదినుండి మనసీమకు అంతులేని అన్యాయం. ప్రాజెక్టును ఇస్తామని మదరాసునుండి పిల్చినారు చుక్క నీరు ఇవ్వకుండ కిందకు మళ్లించినారు . సీమ రైతు గుండెలన్ని ముళ్లచెట్ల కంపలాయె ఎన్నాళ్లీఅగచాట్లు అన్నన్నా తిరగబడు. రైతు కంటి నీళ్లతో పంటలెలా పండుతాయి మభ్య పెట్టు మాటలతో పరిపాలనెలా సాగుతుంది. […]పూర్తి వివరాలు ...